Logo

మార్కు అధ్యాయము 2 వచనము 4

మత్తయి 9:1 తరువాత ఆయన దోనె యెక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా

మత్తయి 9:2 ఇదిగో జనులు పక్షవాయువుతో మంచముపట్టియున్న యొకని ఆయనయొద్దకు తీసికొనివచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను.

మత్తయి 9:3 ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలోతాము అనుకొనగా

మత్తయి 9:4 యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు?

మత్తయి 9:5 నీ పాపములు క్షమింపబడియున్నవని చెప్పుట సులభమా, లేచి నడువుమని చెప్పుట సులభమా?

మత్తయి 9:6 అయినను పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని చెప్పి, ఆయన పక్షవాయువుగలవాని చూచి నీవు లేచి నీ మంచమెత్తికొని నీ యింటికి పొమ్మని చెప్పగా

మత్తయి 9:7 వాడు లేచి తన యింటికి వెళ్లెను.

మత్తయి 9:8 జనులు అది చూచి భయపడి, మనుష్యులకిట్టి అధికారమిచ్చిన దేవుని మహిమపరచిరి.

లూకా 5:18 ఇదిగో కొందరు మనుష్యులు పక్షవాయువుగల యొక మనుష్యుని మంచము మీద మోసికొని, వానిని లోపలికి తెచ్చి, ఆయన యెదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి గాని

లూకా 5:19 జనులు గుంపుకూడి యుండినందున, వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయెను గనుక, ఇంటిమీదికెక్కి పెంకులు విప్పి, మంచముతో కూడ యేసు ఎదుట వారి మధ్యను వానిని దించిరి.

లూకా 5:20 ఆయన వారి విశ్వాసము చూచి మనుష్యుడా, నీ పాపములు క్షమింపబడి యున్నవని వానితో చెప్పగా,

లూకా 5:21 శాస్త్రులును పరిసయ్యులును దేవదూషణ చేయుచున్న యితడెవడు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి.

లూకా 5:22 యేసు వారి ఆలోచనలెరిగి మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు?

లూకా 5:23 నీ పాపములు క్షమింపబడి యున్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నడువుమని చెప్పుట సులభమా?

లూకా 5:24 అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని వారితో చెప్పి, పక్షవాయువు గల వాని చూచి నీవు లేచి, నీ మంచమెత్తికొని నీ యింటికి వేల్లుమని నీతో చెప్పుచున్నాననెను

లూకా 5:25 వెంటనే వాడు వారి యెదుట లేచి, తాను పండుకొనియున్న మంచము ఎత్తికొని, దేవుని మహిమపరచుచు తన యింటికి వెళ్లెను.

లూకా 5:26 అందరును విస్మయమొంది నేడు గొప్ప వింతలు చూచితిమని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొనిరి.

మత్తయి 8:6 ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి, ఆయనను వేడుకొనెను.

మత్తయి 8:16 సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయనయొద్దకు తీసికొనివచ్చిరి.

మార్కు 8:22 అంతలో వారు బేత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయనయొద్దకు ఒక గ్రుడ్డివాని తోడుకొనివచ్చి, వాని ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి.

అపోస్తలులకార్యములు 5:16 మరియు యెరూషలేము చుట్టునుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మలచేత పీడింపబడిన వారిని మోసికొని కూడివచ్చిరి. వారందరు స్వస్థత పొందిరి.

అపోస్తలులకార్యములు 8:7 అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలువేసి వారిని వదలిపోయెను; పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి.

అపోస్తలులకార్యములు 9:33 అక్కడ పక్షవాయువు కలిగి యెనిమిది ఏండ్లనుండి మంచము పట్టియుండిన ఐనెయ అను ఒక మనుష్యుని చూచి,