Logo

మార్కు అధ్యాయము 4 వచనము 2

మార్కు 2:13 ఆయన సముద్రతీరమున మరల నడచిపోవుచుండెను. జనులందరును ఆయనయొద్దకు రాగా ఆయన వారికి బోధించెను.

మత్తయి 13:1 ఆ దినమందు యేసు ఇంటనుండి వెళ్లి సముద్రతీరమున కూర్చుండెను.

మత్తయి 13:2 బహు జనసమూహములు తనయొద్దకు కూడివచ్చినందున ఆయన దోనెయెక్కి కూర్చుండెను. ఆ జనులందరు దరిని నిలిచియుండగా

మత్తయి 13:3 ఆయన వారిని చూచి చాల సంగతులను ఉపమానరీతిగా చెప్పెను. ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్లెను.

మత్తయి 13:4 వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడెను; పక్షులు వచ్చి వాటిని మింగివేసెను

మత్తయి 13:5 కొన్ని చాల మన్నులేని రాతినేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని

మత్తయి 13:6 సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయెను.

మత్తయి 13:7 కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్లపొదలు ఎదిగి వాటిని అణచివేసెను గనుక అవి ఫలింపలేదు.

మత్తయి 13:8 కొన్ని మంచి నేలను పడి, ఒకటి నూరంతలుగాను, ఒకటి అరువదంతలుగాను, ఒకటి ముప్పదంతలుగాను ఫలించెను.

మత్తయి 13:9 చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను.

లూకా 8:4 బహు జనసమూహము కూడి ప్రతి పట్టణమునుండి ఆయన యొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమానరీతిగా ఇట్లనెను

లూకా 8:5 విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుండగా, కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడి త్రొక్కబడెను గనుక, ఆకాశపక్షులు వాటిని మింగివేసెను.

లూకా 8:6 మరికొన్ని రాతినేలను పడి, మొలిచి, చెమ్మలేనందున ఎండిపోయెను.

లూకా 8:7 మరికొన్ని ముండ్లపొదల నడుమ పడెను; ముండ్లపొదలు వాటితో మొలిచి వాటినణచి వేసెను.

లూకా 8:8 మరికొన్ని మంచినేలను పడెను; అవి మొలిచి నూరంతలుగా ఫలించెననెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినును గాక అని బిగ్గరగా చెప్పెను.

లూకా 5:1 జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయనమీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచి,

లూకా 5:2 ఆ సరస్సు తీరముననున్న రెండు దోనెలను చూచెను; జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి.

లూకా 5:3 ఆయన ఆ దోనెలలో సీమోనుదైన యొక దోనె యెక్కి దరినుండి కొంచెము త్రోయుమని అతని నడిగి, కూర్చుండి దోనెలో నుండి జనసమూహములకు బోధించుచుండెను.

మత్తయి 5:1 ఆయన ఆ జనసమూహములను చూచి కొండ యెక్కి కూర్చుండగా ఆయన శిష్యులాయనయొద్దకు వచ్చిరి.

మార్కు 2:2 ఆయన యింట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడివచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా

మార్కు 4:36 వారు జనులను పంపివేసి, ఆయనను ఉన్నపాటున చిన్నదోనెలో తీసికొనిపోయిరి; ఆయన వెంబడి మరికొన్ని దోనెలు వచ్చెను.

లూకా 5:3 ఆయన ఆ దోనెలలో సీమోనుదైన యొక దోనె యెక్కి దరినుండి కొంచెము త్రోయుమని అతని నడిగి, కూర్చుండి దోనెలో నుండి జనసమూహములకు బోధించుచుండెను.