Logo

మార్కు అధ్యాయము 7 వచనము 2

మార్కు 3:22 యెరూషలేమునుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టినవాడై దయ్యముల యధిపతిచేత దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పిరి.

మత్తయి 15:1 ఆ సమయమున యెరూషలేమునుండి శాస్త్రులును పరిసయ్యులును యేసునొద్దకు వచ్చి

లూకా 5:17 ఒకనాడాయన బోధించుచుండగా, గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండియు యెరూషలేము నుండియు వచ్చిన పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులును కూర్చుండియుండగా, ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను.

లూకా 11:53 ఆయన అక్కడనుండి వెళ్లినప్పుడు శాస్త్రులును పరిసయ్యులును ఆయనమీద నిండ పగబట్టి ఆయనమీద నేరము మోపవలెనని యుండి, ఆయన నోటనుండి వచ్చు ఏమాటనైనను పట్టుకొనుటకు పొంచి,

లూకా 11:54 వదకుచు చాల సంగతులనుగూర్చి ఆయనను మాటలాడింపసాగిరి.

ద్వితియోపదేశాకాండము 4:2 మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకాజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీకాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలోనుండి దేనిని తీసివేయకూడదు.

ఎజ్రా 7:11 యెహోవా ఆజ్ఞల వాక్యములయందును, ఆయన ఇశ్రాయేలీయులకు విధించిన కట్టడలయందును శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు రాజైన అర్తహషస్త యిచ్చిన తాకీదు నకలు

మార్కు 8:11 అంతట పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు, ఆకాశమునుండి యొక సూచక క్రియను చూపుమని ఆయన నడిగి ఆయనతో తర్కింపసాగిరి.