Logo

మార్కు అధ్యాయము 8 వచనము 2

మత్తయి 15:32 అంతట యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడు దినములనుండి నాయొద్ద నున్నారు; వారికి తిననేమియు లేదు గనుక వారిమీద కనికరపడుచున్నాను; వారు మార్గములో మూర్చపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా

మత్తయి 15:33 ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్యప్రదేశములో మనకు ఎక్కడనుండి వచ్చునని ఆయనతో అనిరి.

మత్తయి 15:34 యేసు మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారినడుగగా వారు ఏడు రొట్టెలును కొన్ని చిన్న చేపలును ఉన్నవని చెప్పిరి.

మత్తయి 15:35 అప్పుడాయన నేలమీద కూర్చుండుడని జనసమూహమునకు ఆజ్ఞాపించి

మత్తయి 15:36 ఆ యేడు రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను, శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి

మత్తయి 15:37 వారందరు తిని తృప్తి పొందినమీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండ ఎత్తిరి.

మత్తయి 15:38 స్త్రీలును పిల్లలును గాక తినినవారు నాలుగువేలమంది పురుషులు.

మత్తయి 15:39 తరువాత ఆయన జనసమూహములను పంపివేసి, దోనెయెక్కి మగదాను ప్రాంతములకు వచ్చెను.

మత్తయి 14:14 ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి, వారిమీద కనికరపడి, వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను.

మార్కు 8:20 ఆ నాలుగువేల మందికి ఏడు రొట్టెలు నేను విరిచి, పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపలనిండ ఎత్తితిరని ఆయన అడుగగా వారు ఏడనిరి.