Logo

మార్కు అధ్యాయము 13 వచనము 29

మత్తయి 24:32 అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగిరించునప్పుడు వసంతకాలము యింక సమీపముగా ఉన్నదని మీకు తెలియును.

మత్తయి 24:33 ఆ ప్రకారమే మీరీ సంగతులన్నియు జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే యున్నాడని తెలిసికొనుడి.

లూకా 21:29 మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి.

లూకా 21:30 అవి చిగిరించుట చూచి వసంతకాలమప్పుడే సమీపమాయెనని మీ అంతట మీరు తెలిసికొందురు గదా?

లూకా 21:31 అటువలె మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయెనని తెలిసికొనుడి.