Logo

గలతీయులకు అధ్యాయము 5 వచనము 1

గలతీయులకు 5:1 ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కుకొనకుడి.

గలతీయులకు 5:13 సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక్రియలకు హేతువు చేసికొనక, ప్రేమ కలిగినవారై యొకనికొకడు దాసులైయుండుడి.

యోహాను 1:12 తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.

యోహాను 1:13 వారు దేవునివలన పుట్టినవారే గాని, రక్తమువలన నైనను శరీరేచ్ఛవలన నైనను మానుషేచ్ఛవలన నైనను పుట్టినవారు కారు.

యోహాను 8:36 కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినయెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు.

హెబ్రీయులకు 2:14 కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును,

హెబ్రీయులకు 2:15 జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయన కూడ రక్తమాంసములలో పాలివాడాయెను.

1యోహాను 3:1 మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమననుగ్రహించెనొ చూడుడి; మనము దేవుని పిల్లలమే. ఈ హేతువుచేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు.

1యోహాను 3:2 ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమై యున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము.

2దినవృత్తాంతములు 8:9 అయితే ఇశ్రాయేలీయులలో ఒకనినైనను సొలొమోను తన పనిచేయుటకు దాసునిగా నియమింపలేదు; వారిని యోధులుగాను తన అధిపతులలో ప్రధానులుగాను రథములకును గుఱ్ఱపు రౌతులకును అధిపతులుగాను నియమించెను.

యెహెజ్కేలు 46:17 అయితే అతడు తన పనివారిలో ఎవనికైనను భూమి ఇచ్చినయెడల విడుదల సంవత్సరమువరకే అది వాని హక్కై తరువాత అధిపతికి మరలవచ్చును; అప్పుడు అతని కుమారులు అతని స్వాస్థ్యమునకు మాత్రము హక్కుదారులగుదురు.

యోహాను 8:35 దాసుడెల్లప్పుడును ఇంటిలో నివాసము చేయడు; కుమారుడెల్లప్పుడును నివాసము చేయును.

గలతీయులకు 4:3 అటువలె మనమును బాలురమై యున్నప్పుడు లోకసంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమైయుంటిమి;

గలతీయులకు 4:7 కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు.