Logo

గలతీయులకు అధ్యాయము 6 వచనము 14

మత్తయి 23:3 గనుక వారు మీతో చెప్పువాటినన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియలచొప్పున చేయకుడి; వారు చెప్పుదురేగాని చేయరు.

మత్తయి 23:15 అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టివచ్చెదరు; అతడు కలిసినప్పుడు అతని మీకంటె రెండంతలు నరకపాతృనిగా చేయుదురు

మత్తయి 23:23 అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకఱ్ఱలోను పదియవ వంతు చెల్లించి, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసియుండెను

రోమీయులకు 2:17 నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవునియందు అతిశయించుచున్నావు కావా?

రోమీయులకు 2:18 ఆయన చిత్తమెరిగి, ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందినవాడవై శ్రేష్ఠమైనవాటిని మెచ్చుకొనుచున్నావు కావా?

రోమీయులకు 2:19 జ్ఞానసత్యస్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవైయుండి నేను గ్రుడ్డివారికి త్రోవచూపువాడను,

రోమీయులకు 2:20 చీకటిలో ఉండువారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యాయుడనై యున్నానని నీయంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా?

రోమీయులకు 2:21 ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా?

రోమీయులకు 2:22 వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా? విగ్రహములను అసహ్యించుకొను నీవు గుళ్లను దోచెదవా?

రోమీయులకు 2:23 ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుటవలన దేవుని అవమానపరచెదవా?

రోమీయులకు 2:24 వ్రాయబడిన ప్రకారము మిమ్మునుబట్టియేగదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది?

రోమీయులకు 3:9 ఆలాగైన ఏమందుము? మేము వారికంటె శ్రేష్ఠులమా? తక్కువవారమా? ఎంతమాత్రమును కాము. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరును పాపమునకు లోనైయున్నారని యింతకుముందు దోషారోపణ చేసియున్నాము.

రోమీయులకు 3:10 ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు

రోమీయులకు 3:11 గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు

రోమీయులకు 3:12 అందరును త్రోవతప్పి యేకముగా పనికిమాలినవారైరి. మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు.

రోమీయులకు 3:13 వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు; వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది

రోమీయులకు 3:14 వారి నోటినిండ శపించుటయు పగయు ఉన్నవి.

రోమీయులకు 3:15 రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తుచున్నవి.

రోమీయులకు 3:16 నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి.

రోమీయులకు 3:17 శాంతిమార్గము వారెరుగరు.

రోమీయులకు 3:18 వారి కన్నులయెదుట దేవుని భయము లేదు.

రోమీయులకు 3:19 ప్రతి నోరు మూయబడునట్లును, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును, ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైనవారితో చెప్పుచున్నదని యెరుగుదుము.

2పేతురు 2:19 తామే భ్రష్టత్వమునకు దాసులైయుండియు, అట్టివారికి స్వాతంత్ర్యము ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేనివలన జయింపబడునో దానికి దాసుడగును గదా

1కొరిందీయులకు 3:21 కాబట్టి యెవడును మనుష్యులయందు అతిశయింపకూడదు; సమస్తమును మీవి.

1కొరిందీయులకు 5:6 మీరు అతిశయపడుట మంచిదికాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరుగరా?

2కొరిందీయులకు 11:18 అనేకులు శరీర విషయములో అతిశయపడుచున్నారు గనుక నేనును ఆలాగే అతిశయపడుదును.

మత్తయి 23:4 మోయశక్యముకాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజములమీద వారు పెట్టుదురేగాని తమ వ్రేలితోనైన వాటిని కదలింపనొల్లరు.

లూకా 5:38 అయితే క్రొత్త ద్రాక్షారసము కొత్త తిత్తులలో పోయవలెను.

లూకా 11:46 ఆయన అయ్యో, ధర్మశాస్త్రోపదేశకులారా, మోయశక్యము కాని బరువులను మీరు మనుష్యులమీద మోపుదురు గాని మీరు ఒక వ్రేలితోనైనను ఆ బరువులను ముట్టరు.

యోహాను 3:26 గనుక వారు యోహాను నొద్దకు వచ్చి బోధకుడా, యెవడు యొర్దానుకు అవతల నీతో కూడ ఉండెనో, నీవెవనిగూర్చి సాక్ష్యమిచ్చితివో, యిదిగో, ఆయన బాప్తిస్మమిచ్చుచున్నాడు; అందరు ఆయనయొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి.

యోహాను 7:19 మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా? అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రమును గైకొనడు; మీరెందుకు నన్ను చంపజూచుచున్నారని వారితో చెప్పెను.

అపోస్తలులకార్యములు 7:53 దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరిగాని దానిని గైకొనలేదని చెప్పెను.

అపోస్తలులకార్యములు 15:1 కొందరు యూదయనుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి.

అపోస్తలులకార్యములు 15:24 కొందరు మాయొద్దనుండి వెళ్లి, తమ బోధచేత మిమ్మును కలవరపరచి, మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేమధికారమిచ్చి యుండలేదు

అపోస్తలులకార్యములు 20:30 మరియు శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు.

రోమీయులకు 2:21 ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా?

రోమీయులకు 4:2 అబ్రాహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడినయెడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని యెదుట కలుగదు.

1కొరిందీయులకు 1:31 అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను.

2కొరిందీయులకు 10:17 అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను.

2కొరిందీయులకు 11:12 అతిశయ కారణము వెదకువారు ఏవిషయములో అతిశయించుచున్నారో, ఆ విషయములో వారును మావలెనే యున్నారని కనబడు నిమిత్తము వారికి కారణము దొరకకుండ కొట్టివేయుటకు, నేను చేయుచున్న ప్రకారమే ఇక ముందుకును చేతును

గలతీయులకు 1:7 అది మరియొక సువార్త కాదుగాని, క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు.

గలతీయులకు 4:17 వారు మీ మేలుకోరి మిమ్మును ఆసక్తితో వెంటాడువారు కారు; మీరే తమ్మును వెంటాడవలెనని మిమ్మును బయటికి త్రోసివేయ గోరుచున్నారు.

గలతీయులకు 5:10 మీరెంతమాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మునుగూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును.

గలతీయులకు 6:4 ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను; అప్పుడు ఇతరునిబట్టి కాక తననుబట్టియే అతనికి అతిశయము కలుగును.

గలతీయులకు 6:12 శరీర విషయమందు చక్కగా అగపడగోరువారెవరో వారు తాము క్రీస్తు యొక్క సిలువవిషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలెనని మిమ్మును బలవంతము చేయుచున్నారు

ఫిలిప్పీయులకు 3:3 ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసికొనక దేవునియొక్క ఆత్మవలన ఆరాధించుచు, క్రీస్తుయేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము.

ఫిలిప్పీయులకు 3:19 నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు; వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు, భూసంబంధమైన వాటియందే మనస్సు నుంచుచున్నారు.

1దెస్సలోనీకయులకు 2:6 మరియు మేము క్రీస్తుయొక్క అపొస్తలులమై యున్నందున అధికారము చేయుటకు సమర్థులమై యున్నను, మీవలననే గాని యితరులవలననే గాని, మనుష్యులవలన కలుగు ఘనతను మేము కోరలేదు.

యాకోబు 3:14 అయితే మీ హృదయములలో సహింపనలవికాని మత్సరమును వివాదమును ఉంచుకొనినవారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు.