Logo

1తిమోతి అధ్యాయము 2 వచనము 13

ఆదికాండము 3:16 ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను; వేదనతో పిల్లలను కందువు; నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలునని చెప్పెను.

ఎస్తేరు 1:22 ప్రతి పురుషుడు తన యింటిలో అధికారిగా నుండవలెననియు, ప్రతి పురుషుడు తన స్వభాష ననుసరించి తన యింటివారితో మాటలాడవలెననియు ఆజ్ఞ ఇచ్చి, ప్రతి సంస్థానమునకు దాని వ్రాత ప్రకారముగాను, ప్రతి జనమునకు దాని భాష ప్రకారముగాను రాజు తన సకలమైన సంస్థానములకు దానినిగూర్చిన తాకీదులు పంపించెను.

1కొరిందీయులకు 11:3 ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసికొనవలెనని కోరుచున్నాను.

1కొరిందీయులకు 14:34 స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను; వారు లోబడి యుండవలసినదే గాని, మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది.

ఎఫెసీయులకు 5:22 స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి.

కొలొస్సయులకు 3:18 భార్యలారా, మీ భర్తలకు విధేయులై యుండుడి; ఇది ప్రభువునుబట్టి యుక్తమైయున్నది.

తీతుకు 2:5 మంచి ఉపదేశము చేయువారునై యుండవలెననియు బోధించుము.

1పేతురు 3:1 అటువలె స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి;