Logo

1తిమోతి అధ్యాయము 5 వచనము 17

1తిమోతి 5:4 అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనుమలు గాని యుండినయెడల, వీరు మొదట తమ యింటివారియెడల భక్తి కనుపరచుటకును, తమ తలిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను; ఇది దేవుని దృష్టికనుకూలమైయున్నది.

1తిమోతి 5:8 ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపక పోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును.

1తిమోతి 5:3 నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము.

1తిమోతి 5:5 అయితే నిజముగా అనాథయైన విధవరాలు ఏకాకియై యుండి, దేవుని మీదనే తన నిరీక్షణనుంచుకొని, విజ్ఞాపనల యందును ప్రార్థనల యందును రేయింబగలు నిలుకడగా ఉండును.

మత్తయి 15:6 మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు.