Logo

యెహోషువ అధ్యాయము 21 వచనము 13

1దినవృత్తాంతములు 6:56 అయితే ఆ పట్టణపు పొలములును దాని గ్రామములును యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఇయ్యబడెను.

యెహోషువ 15:54 యానీము బేత్తపూయ అఫెకా హుమ్తా కిర్యతర్బా అను హెబ్రోను సీయోరు అనునవి, వాటి పల్లెలు పోగా తొమ్మిది పట్టణములు.

యెహోషువ 20:7 అప్పుడు వారు నఫ్తా లీయుల మన్యములోని గలిలయలో కెదెషును, ఎఫ్రాయి మీయుల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనను కిర్యతర్బాను ప్రతిష్ఠపరచిరి.

సంఖ్యాకాండము 35:6 మరియు మీరు లేవీయులకిచ్చు పురములలో ఆరు ఆశ్రయపురములుండవలెను. నరహంతుకుడు వాటిలోనికి పారిపోవునట్లుగా వాటిని నియమింపవలెను. అవియు గాక నలువదిరెండు పురములను ఇయ్యవలెను.

యెహోషువ 10:29 యెహోషువయు అతనితో కూడ ఇశ్రాయేలీయు లందరును మక్కేదానుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్ధముచేసిరి.

యెహోషువ 15:42 లిబ్నా ఎతెరు ఆషాను యిప్తా అష్నానెసీబు

1దినవృత్తాంతములు 6:57 అహరోను సంతతివారికి వచ్చిన పట్టణములేవనగా ఆశ్రయపట్టణమైన హెబ్రోను లిబ్నా దాని గ్రామములు, యత్తీరు ఎష్టెమో దాని గ్రామములు,

యెషయా 37:8 అష్షూరు రాజు లాకీషు పట్టణమును విడిచివెళ్లి లిబ్నామీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతని కలిసికొనెను.

సంఖ్యాకాండము 13:22 వారు దక్షిణదిక్కున ప్రయాణముచేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులు అహీమాను షేషయి తల్మయి అనువారుండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయనుకంటె ఏడేండ్లు ముందుగా కట్టబడెను.

యెహోషువ 10:36 అప్పుడు యెహోషువయు అతనితో కూడ ఇశ్రాయేలీయులందరును ఎగ్లోనునుండి హెబ్రోనుమీదికి పోయి దాని జనులతో యుద్ధముచేసి

యెహోషువ 21:9 వారు యూదావంశస్థుల గోత్రములోను షిమ్యోనీ యుల గోత్రములోను చెప్పబడిన పేరులుగల యీ పట్టణ ములను ఇచ్చిరి.

2రాజులు 8:22 అయితే నేటివరకును ఎదోమీయులు తిరుగుబాటు చేసి యూదావారికి లోబడకయే యున్నారు. మరియు ఆ సమయమందు లిబ్నా పట్టణమును తిరుగబడెను.

2దినవృత్తాంతములు 21:10 కాగా నేటివరకును జరుగుచున్నట్టు ఎదోమీయులు యూదావారి చేతిక్రింద నుండక తిరుగబడిరి. యెహోరాము తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున ఆ కాలమందు లిబ్నాయును అతని చేతిక్రిందనుండి తిరుగబడెను.

లూకా 1:39 ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి