Logo

యెహోషువ అధ్యాయము 21 వచనము 36

యెహోషువ 20:8 తూర్పుదిక్కున యొర్దాను అవతల యెరికోనొద్ద రూబేనీ యుల గోత్రములోనుండి మైదానము మీదనున్న అరణ్య ములోని బేసెరును, గాదీయుల గోత్రము లోనుండి గిలాదు లోని రామోతును, మనష్షీయుల గోత్రములోనుండి బాషానులోని గోలానును నియమించిరి.

ద్వితియోపదేశాకాండము 4:43 అవేవనగా రూబేనీయులకు మైదానపు దేశారణ్యమందలి బేసెరును, గాదీయులకు గిలాదులోనున్న రామోతును, మనష్షీయులకు బాషానులోనున్న గోలాను అనునవే.

1దినవృత్తాంతములు 6:78 యెరికోకు ఆవల యొర్దానునకు తూర్పుగా ఉండు రూబేను గోత్రస్థానములోనుండి అరణ్యములోని బేసెరు దాని గ్రామములు, యహజాయు దాని గ్రామములు,

1దినవృత్తాంతములు 6:79 కెదేమోతు దాని గ్రామములు, మేఫాతు దాని గ్రామములు,

యెహోషువ 13:18 యాహసు కెదేమోతు మేఫాతు

సంఖ్యాకాండము 21:23 అయితే సీహోను ఇశ్రాయేలీయులను తన పొలిమేరలను దాటనియ్యలేదు. మరియు సీహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇశ్రాయేలీయులను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్లి, యాహజుకు వచ్చి ఇశ్రాయేలీయులతో యుద్ధముచేసెను.

1దినవృత్తాంతములు 6:78 యెరికోకు ఆవల యొర్దానునకు తూర్పుగా ఉండు రూబేను గోత్రస్థానములోనుండి అరణ్యములోని బేసెరు దాని గ్రామములు, యహజాయు దాని గ్రామములు,

సంఖ్యాకాండము 35:6 మరియు మీరు లేవీయులకిచ్చు పురములలో ఆరు ఆశ్రయపురములుండవలెను. నరహంతుకుడు వాటిలోనికి పారిపోవునట్లుగా వాటిని నియమింపవలెను. అవియు గాక నలువదిరెండు పురములను ఇయ్యవలెను.

యిర్మియా 48:21 మైదానములోని దేశమునకు శిక్ష విధింపబడియున్నది హోలోనునకును యాహసునకును మేఫాతునకును దీబోనుకును

యిర్మియా 48:24 మోయాబుదేశ పురములన్నిటికిని శిక్ష విధింపబడియున్నది.