Logo

రూతు అధ్యాయము 1 వచనము 10

కీర్తనలు 16:3 నేనీలాగందును భూమిమీదనున్న భక్తులే శ్రేష్టులు; వారు నాకు కేవలము ఇష్టులు.

కీర్తనలు 119:63 నీయందు భయభక్తులు గలవారందరికిని నీ ఉపదేశములను అనుసరించువారికిని నేను చెలికాడను.

జెకర్యా 8:23 సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఆ దినములలో ఆ యా భాషలు మాటలాడు అన్యజనులలో పదేసిమంది యొక యూదుని చెంగుపట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడ వత్తుమని చెప్పుదురు.

రూతు 1:7 అప్పుడు ఆమెయున్న స్థలమునుండి ఆమెతో కూడ ఆమె యిద్దరు కోడండ్రును బయలుదేరి యూదా దేశమునకు తిరిగిపోవలెనని మార్గమున వెళ్లుచుండగా