Logo

రూతు అధ్యాయము 3 వచనము 18

కీర్తనలు 37:3 యెహోవాయందు నమ్మికయుంచి మేలుచేయుము దేశమందు నివసించి సత్యము ననుసరించుము

కీర్తనలు 37:4 యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును.

కీర్తనలు 37:5 నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును.

యెషయా 28:16 ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు సీయోనులో పునాదిగా రాతిని వేసినవాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాదియైన మూలరాయియై యున్నది విశ్వసించువాడు కలవరపడడు.

యెషయా 30:7 ఐగుప్తువలని సహాయము పనికిమాలినది, నిష్ప్రయోజనమైనది అందుచేతను ఏమియు చేయక ఊరకుండు గప్పాలమారి అని దానికి పేరు పెట్టుచున్నాను.

కీర్తనలు 132:4 ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచువరకు యాకోబుయొక్క బలిష్ఠునికి ఒక నివాసస్థలము నేను చూచువరకు