Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 9 వచనము 13

1దినవృత్తాంతములు 26:6 వాని కుమారుడైన షెమయాకు కుమారులు పుట్టిరి; వారు పరాక్రమశాలులైయుండి తమ తండ్రి యింటివారికి పెద్దలైరి.

1దినవృత్తాంతములు 26:30 హెబ్రోనీయులను గూర్చినది. హషబ్యాయును వాని సహోదరులును పరాక్రమశాలులును వేయిన్ని యేడువందల సంఖ్య గలవారు, వీరు యొర్దాను ఈవల పడమటివైపుననుండు ఇశ్రాయేలీయుల మీద యెహోవా సేవనుగూర్చిన వాటన్నిటి విషయములోను రాజు నియమించిన పని విషయములోను పైవిచారణకర్తలుగా నియమింపబడిరి.

1దినవృత్తాంతములు 26:32 పరాక్రమశాలులగు వాని సహోదరులు రెండువేల ఏడువందలమంది యింటిపెద్దలుగా కనబడిరి, దావీదు రాజు దేవుని సంబంధమైన కార్యముల విషయములోను రాజకార్యముల విషయములోను రూబేనీయుల మీదను గాదీయులమీదను మనష్షే అర్ధగోత్రపు వారిమీదను వారిని నియమించెను.

నెహెమ్యా 11:14 బలవంతులైనవారి బంధువులు నూట ఇరువది యెనమండుగురు. వారికి జబ్దీయేలు పెద్దగా ఉండెను; ఇతడు ఘనులైన వారిలో ఒకని కుమారుడు.

ఆదికాండము 10:29 ఓఫీరును హవీలాను యోబాబును కనెను. వీరందరు యొక్తాను కుమారులు.

2రాజులు 11:4 ఏడవ సంవత్సరమందు యెహోయాదా కావలికాయు వారిమీదను రాజదేహ సంరక్షకులమీదను ఏర్పడియున్న శతాధిపతులను పిలువనంపించి, యెహోవా మందిరములోనికి వారిని తీసికొనిపోయి, యెహోవా మందిరమందు వారిచేత ప్రమాణము చేయించి వారితో నిబంధనచేసి, వారికి ఆ రాజు కుమారుని కనుపరచి యీలాగు ఆజ్ఞాపించెను

1దినవృత్తాంతములు 9:34 వీరు తమ వంశపట్టీల చొప్పున లేవీయుల పితరులలో పెద్దలైనవారు. వీరు యెరూషలేమునందు కాపురముండిరి.

నెహెమ్యా 11:12 ఇంటిపని చేసినవారి సహోదరులు ఎనిమిదివందల ఇరువది యిద్దరు. మరియు పితరులైన మల్కీయా పషూరు జెకర్యా అమ్జీ పెలల్యాల వరుసలో యెరోహామునకు పుట్టిన అదాయా.