Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 9 వచనము 25

2రాజులు 11:5 మీరు చేయవలసినదేమనగా, విశ్రాంతి దినమున లోపల ప్రవేశించు మీరు మూడు భాగములై యొక భాగము రాజమందిరమునకు కావలి కాయువారై యుండవలెను;

2రాజులు 11:7 మరియు విశ్రాంతిదినమున బయలుదేరు మీయందరిలో రెండు భాగములు రాజు దగ్గర యెహోవా మందిరమునకు కాపు కాయువారై యుండవలెను.

2దినవృత్తాంతములు 23:8 కాబట్టి లేవీయులును యూదావారందరును యాజకుడైన యెహోయాదా ఆజ్ఞ యంతటి ప్రకారము చేసిరి; యాజకుడైన యెహోయాదా వంతులవారికి సెలవియ్యలేదు గనుక ప్రతివాడు విశ్రాంతిదినమున బయటికి వెళ్లవలసిన తనవారిని ఆ దినమున లోపలికి రావలసిన తనవారిని తీసికొనివచ్చెను.

1దినవృత్తాంతములు 9:22 గుమ్మములయొద్ద ద్వారపాలకులుగా ఏర్పడిన వీరందరు రెండువందల పన్నిద్దరు; వీరు తమ గ్రామముల వరుసను తమ వంశావళిచొప్పున సరిచూడబడిరి; వీరు నమ్మదగినవారని దావీదును దీర్ఘదర్శియగు సమూయేలును వీరిని నియమించిరి.

1దినవృత్తాంతములు 24:19 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారి పితరుడగు అహరోనునకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారముగా వారు తమ పద్ధతిచొప్పున యెహోవా మందిరములో ప్రవేశించి చేయవలసిన సేవాధర్మము ఈలాగున ఏర్పాటు ఆయెను.

లూకా 1:23 అతడు సేవచేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన యింటికి వెళ్లెను.