Logo

యోబు అధ్యాయము 11 వచనము 3

యోబు 13:4 మీరైతే అబద్ధములు కల్పించువారు. మీరందరు పనికిమాలిన వైద్యులు.

యోబు 15:2 జ్ఞానము గలవాడు నిరర్థకమైన తెలివితో ప్రత్యుత్తరమియ్యదగునా? తూర్పుగాలితో తన కడుపు నింపుకొనదగునా?

యోబు 15:3 వ్యర్థ సంభాషణచేత వ్యాజ్యెమాడదగునా? నిష్‌ ప్రయోజనమైన మాటలచేత వాదింపదగునా?

యోబు 24:25 ఇప్పుడు ఈలాగు జరుగనియెడల నేను అబద్ధికుడనని రుజువు పరచువాడెవడు? నా మాటలు వట్టివని దృష్టాంతపరచువాడెవడు?

యోబు 12:4 నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను. నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను.

యోబు 13:9 ఆయన మిమ్మును పరిశోధించుట మీకు క్షేమమా? లేక ఒకడు నరులను మోసముచేయునట్లు మీరు ఆయనను మోసము చేయుదురా?

యోబు 17:2 ఎగతాళి చేయువారు నాయొద్ద చేరియున్నారు వారు పుట్టించు వివాదములు నా కన్నుల కెదురుగానున్నవి.

యోబు 34:7 యోబువంటి మానవుడెవడు? అతడు మంచి నీళ్లవలె తిరస్కారమును పానము చేయుచున్నాడు.

కీర్తనలు 35:16 విందుకాలమునందు దూషణలాడు వదరుబోతులవలె వారు నా మీద పండ్లుకొరికిరి.

యిర్మియా 15:17 సంతోషించు వారి సమూహములో నేను కూర్చుండలేదు నేను ఉల్లసింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపియున్నావు గనుక, నీ హస్తమునుబట్టి నేను ఏకాకినై కూర్చుంటిని.

యూదా 1:18 మన ప్రభువైన యేసుక్రీస్తు అపొస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసికొనుడి.

కీర్తనలు 83:16 యెహోవా, వారు నీ నామమును వెదకునట్లు వారికి పూర్ణావమానము కలుగజేయుము.

2దెస్సలోనీకయులకు 3:14 ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడనియెడల అతనిని కనిపెట్టి, అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి.

తీతుకు 2:8 నీ ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను.

యోబు 6:28 దయచేసి నావైపు చూడుడి, మీ ముఖము ఎదుట నేను అబద్ధమాడుదునా?

యోబు 8:2 ఎంతకాలము నీవిట్టి మాటలాడెదవు? నీ నోటి మాటలు సుడిగాలి వంటివాయెను.

యోబు 13:5 మీరు కేవలము మౌనముగా నుండుట మేలు అది మీకు జ్ఞానమని యెంచబడును.

యోబు 16:2 ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను మీరందరు బాధకే కర్తలుగాని ఆదరణకు కర్తలుకారు.

యోబు 19:3 పదిమారులు మీరు నన్ను నిందించితిరి సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు.

యోబు 19:4 నేను తప్పుచేసినయెడల నా తప్పు నా మీదికే వచ్చును గదా?

యోబు 34:8 అతడు చెడుతనము చేయువారికి చెలికాడాయెను భక్తిహీనులకు సహవాసి ఆయెను.

యోబు 34:37 అతడు తన పాపమునకు తోడుగా ద్రోహము కూర్చుకొనుచున్నాడు మనయెదుట చప్పట్లుకొట్టి దేవునిమీద కాని మాటలు పెంచుచున్నాడు.

యిర్మియా 9:5 సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగువానిని వంచించును, అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసియున్నారు, ఎదుటివాని తప్పులు పట్టవలెనని ప్రయాసపడుదురు.