Logo

యోబు అధ్యాయము 11 వచనము 4

యోబు 6:10 అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండ లేదని నేను ఆదరణ పొందుదును మరియు నేనెంత వేదనపడుచుండినను దానిబట్టి హర్షించుదును

యోబు 10:7 నీవేల నా దోషమునుగూర్చి విచారణ చేయుచున్నావు? నా పాపమును ఏల వెదకుచున్నావు?

1పేతురు 3:15 నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి, మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి;

యోబు 6:29 అన్యాయము లేకుండ నా సంగతి మరల విచారించుడి మరల విచారించుడి, నేను నిర్దోషినిగా కనబడుదును.

యోబు 6:30 నా నోట అన్యాయముండునా? దుర్మార్గత రుచి నా నోరు తెలిసికొనజాలదా?

యోబు 7:20 నేను పాపము చేసితినా? నరులను కనిపెట్టువాడా, నేను నీయెడల ఏమి చేయగలను? నాకు నేనే భారముగా నున్నాను, నీవేల గురిపెట్టితివి?

యోబు 9:2 వాస్తవమే, ఆ సంగతి అంతేయని నేనెరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును?

యోబు 9:3 వాడు ఆయనతో వ్యాజ్యెమాడ గోరినయెడల వేయి ప్రశ్నలలో ఒక్కదానికైనను వాడు ఆయనకు ఉత్తరమియ్యలేడు.

యోబు 14:4 పాపసహితునిలోనుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు? ఆలాగున ఎవడును పుట్టనేరడు.

యోబు 34:5 నేను నీతిమంతుడను దేవుడు నా పట్ల న్యాయము తప్పెను

యోబు 34:6 న్యాయవంతుడనై యుండియు నేను అబద్దికునిగా ఎంచబడుచున్నాను నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగెనని యోబు అనుచున్నాడు.

యోబు 35:2 నేను పాపము చేసినయెడల నాకు కలిగిన లాభము కన్న నా నీతివలన నాకు కలిగిన లాభమేమి అది నీకు ప్రయోజనమేమి? అని నీవు చెప్పుచున్నావే?

నిర్గమకాండము 38:21 మందిరపదార్థముల మొత్తము, అనగా సాక్ష్యపు మందిర పదార్థముల మొత్తము ఇదే. ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడగు ఈతామారు లేవీయులచేత మోషే మాటచొప్పున లెక్క పెట్టించెను.

యోబు 9:14 కావున ఆయనకు ప్రత్యుత్తరమిచ్చుటకు నేనెంతటివాడను? ఆయనతో వాదించుచు సరియైన మాటలు పలుకుటకు నేనేపాటివాడను?

యోబు 33:9 ఏమనగానేను నేరములేని పవిత్రుడను మాలిన్యములేని పాపరహితుడను.