Logo

యోబు అధ్యాయము 29 వచనము 19

యోబు 18:16 క్రింద వారి వేళ్లు ఎండిపోవును పైన వారి కొమ్మలు నరకబడును.

కీర్తనలు 1:3 అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును అతడు చేయునదంతయు సఫలమగును.

యిర్మియా 17:8 వాడు జలములయొద్ద నాటబడిన చెట్టువలె నుండును; అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును; వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగానుండును, వర్షములేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు.

హోషేయ 14:5 చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతనికుందును, తామరపుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధినొందును, లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు.

హోషేయ 14:6 అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవచెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికుండును.

హోషేయ 14:7 అతని నీడయందు నివసించువారు మరలివత్తురు. ధాన్యమువలె వారు తిరిగి మొలుతురు ద్రాక్షచెట్టువలె వారు వికసింతురు. లెబానోను ద్రాక్షరసము వాసనవలె వారు పరిమళింతురు.

ద్వితియోపదేశాకాండము 33:13 యోసేపునుగూర్చి యిట్లనెను ఆకాశ పరమార్థములవలన మంచువలన క్రింద క్రుంగియున్న అగాధ జలములవలన

యోబు 8:17 అతని వేళ్లు గట్టుమీద చుట్టుకొనును రాళ్లుగల తన నివాసమును అతడు తేరిచూచును.

యోబు 16:12 నేను నెమ్మదిగానుంటిని అయితే ఆయన నన్ను ముక్కలు చెక్కలు చేసియున్నాడు మెడ పట్టుకొని విదలించి నన్ను తుత్తునియలుగా చేసియున్నాడు. తనకు నన్ను గురిదిబ్బగా నిలిపియున్నాడు

యోబు 38:28 వర్షమునకు తండ్రి యున్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు?

యెషయా 26:19 మృతులైన నీవారు బ్రదుకుదురు నావారి శవములు సజీవములగును మంటిలో పడియున్నవారలారా, మేల్కొని ఉత్స హించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును.