Logo

యోబు అధ్యాయము 29 వచనము 22

యోబు 32:15 వారు ఆశ్చర్యపడి ఇకను ఉత్తరమియ్యకయున్నారు పలుకుటకు వారికి మాటయొకటియు లేదు.

యోబు 32:16 కాగా వారికనేమియు ప్రత్యుత్తరము చెప్పకయున్నారు వారు మాటలాడకపోవుట చూచి నేను ఊరకుందునా?

యోబు 33:31 యోబూ, చెవిని బెట్టుము నా మాట ఆలకింపుము మౌనముగా నుండుము నేను మాటలాడెదను.

యోబు 33:32 చెప్పవలసిన మాట యేదైన నీకున్నయెడల నాతో ప్రత్యుత్తరము చెప్పుము మాటలాడుము, నీవు నీతిమంతుడవని స్థాపింప గోరుచున్నాను.

యోబు 33:33 మాట యేమియు లేనియెడల నీవు నా మాట ఆలకింపుము మౌనముగా నుండుము, నేను నీకు జ్ఞానము బోధించెదను.

యెషయా 52:15 ఆలాగే అతడు అనేక జనములను చిలకరించును రాజులు అతని చూచి నోరు మూసికొనెదరు తమకు తెలియజేయబడని సంగతులు వారు చూచెదరు తాము విననిదానిని గ్రహింతురు.

మత్తయి 22:46 ఎవడును మారుమాట చెప్పలేకపోయెను. మరియు ఆ దినమునుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్నయు అడుగ తెగింపలేదు.

ద్వితియోపదేశాకాండము 32:2 నా ఉపదేశము వానవలె కురియును నా వాక్యము మంచువలెను లేతగడ్డిమీద పడు చినుకులవలెను పచ్చికమీద కురియు వర్షమువలెను ఉండును.

పరమగీతము 4:11 ప్రాణేశ్వరీ, నీ పెదవులు తేనియలొలుకుచున్నట్టున్నవి నీ జిహ్వక్రింద మధుక్షీరములు కలవు నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసనవలె నున్నది.

యెహెజ్కేలు 20:46 నరపుత్రుడా, నీ ముఖము దక్షిణపుతట్టు త్రిప్పుకొని దక్షిణ దేశమునకు ప్రకటింపుము, దక్షిణదేశపు అరణ్యమునుగూర్చి ప్రవచించి ఇట్లనుము

ఆమోసు 7:16 యెహోవా మాట ఆలకించుము ఇశ్రాయేలీయులనుగూర్చి ప్రవచింపకూడదనియు ఇస్సాకు సంతతివారినిగూర్చి మాట జారవిడువకూడదనియు నీవు ఆజ్ఞ ఇచ్చుచున్నావే.

మీకా 2:6 మీరు దీని ప్రవచింపవద్దని వారు ప్రకటన చేయుదురు. ప్రవచింపనియెడల అవమానము కలుగక మానదు.

సామెతలు 10:21 నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును బుద్ధి లేకపోవుటచేత మూఢులు చనిపోవుదురు.