Logo

యోబు అధ్యాయము 34 వచనము 3

యోబు 6:30 నా నోట అన్యాయముండునా? దుర్మార్గత రుచి నా నోరు తెలిసికొనజాలదా?

యోబు 12:11 అంగిలి ఆహారమును రుచి చూచునట్లు చెవి మాటలను పరీక్షింపదా?

1కొరిందీయులకు 2:15 ఆత్మసంబంధియైనవాడు అన్నిటిని వివేచించును గాని అతడెవనిచేతనైనను వివేచింపబడడు.

హెబ్రీయులకు 5:14 వయస్సు వచ్చినవారు అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన అహారము వారికే తగును.

యోబు 31:30 నేనాలాగు చేయలేదు, అతని ప్రాణమును నేను శపించలేదు పాపము చేయుటకు నా నోటికి నేను చోటియ్యనే లేదు.

యోబు 33:2 ఇదిగో నేను మాటలాడ నారంభించితిని నా నోట నా నాలుక ఆడుచున్నది.

యోబు 6:6 ఉప్పులేక యెవరైన రుచిలేనిదాని తిందురా? గ్రుడ్డులోని తెలుపులో రుచికలదా?

యోబు 6:26 మాటలను గద్దించుదమని మీరనుకొందురా? నిరాశగలవాని మాటలు గాలివంటివే గదా.

యోబు 34:10 విజ్ఞానముగల మనుష్యులారా, నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయము చేయుట అసంభవము. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము

యెషయా 11:3 యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును.

1కొరిందీయులకు 10:15 బుద్ధిమంతులతో మాటలాడినట్లు మీతో మాటలాడుచున్నాను; నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి

ఫిలిప్పీయులకు 1:10 ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు, మీరు యేసుక్రీస్తువలననైన నీతిఫలములతో నిండికొనిన