Logo

యోబు అధ్యాయము 34 వచనము 12

కీర్తనలు 11:7 యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు.

కీర్తనలు 145:17 యెహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు

హబక్కూకు 1:12 యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆదినుండి నీవున్నవాడవు కావా? మేము మరణము నొందము; యెహోవా, తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించియున్నావు; ఆశ్రయదుర్గమా, మమ్మును దండించుటకు వారిని పుట్టించితివి.

హబక్కూకు 1:13 నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది గదా; బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు గదా; కపటులను నీవు చూచియు, దుర్మార్గులు తమకంటె ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు?

యోబు 8:3 దేవుడు న్యాయవిధిని రద్దుపరచునా? సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరచునా?

యోబు 33:23 నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో ఘనుడగు ఒకడు వానికి మధ్యవర్తియై యుండినయెడల

సామెతలు 17:7 అహంకారముగా మాటలాడుట బుద్ధిలేనివానికి తగదు అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు.