Logo

యోబు అధ్యాయము 38 వచనము 5

యోబు 11:9 దాని పరిమాణము భూమికంటె అధికమైనది దాని వెడల్పు సముద్రముకంటె అధికమైనది

యోబు 28:25 గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించినప్పుడు ప్రమాణమునుబట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు

సామెతలు 8:27 ఆయన ఆకాశవిశాలమును స్థిరపరచినప్పుడు మహాజలములమీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ నుంటిని.

యెషయా 40:12 తన పుడిసిటిలో జలములు కొలిచినవాడెవడు? జేనతో ఆకాశముల కొల చూచినవాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచినవాడెవడు? త్రాసుతో పర్వతములను తూచినవాడెవడు? తూనికచేత కొండలను తూచినవాడెవడు?

యెషయా 40:22 ఆయన భూమండలముమీద ఆసీనుడైయున్నాడు దాని నివాసులు మిడతలవలె కనబడుచున్నారు ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశవైశాల్యమును వ్యాపింపజేసెను ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచెను.

కీర్తనలు 19:4 వాటి కొలనూలు భూమియందంతట వ్యాపించియున్నది లోకదిగంతములవరకు వాటి ప్రకటనలు బయలువెళ్లుచున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను.

కీర్తనలు 78:55 వారియెదుటనుండి అన్యజనులను వెళ్లగొట్టెను. కొలనూలుచేత వారి స్వాస్థ్యమును వారికి పంచి యిచ్చెను. ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివసింపజేసెను.

యెషయా 34:11 గూడబాతులును ఏదుపందులును దాని ఆక్రమించుకొనును గుడ్లగూబయు కాకియు దానిలో నివసించును ఆయన తారుమారు అను కొలనూలును చాచును శూన్యమను గుండును పట్టును.

జెకర్యా 2:1 మరియు నేను తేరిచూడగా కొలనూలుచేత పట్టుకొనిన యొకడు నాకు కనబడెను.

జెకర్యా 2:2 నీవెక్కడికి పోవుచున్నావని నేనతని నడుగగా అతడు యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచి చూడబోవుచున్నాననెను.

2కొరిందీయులకు 10:16 మీ ఆవలి ప్రదేశములలో కూడ సువార్త ప్రకటించునట్లుగా, మేము మీ మూలముగా ఘనపరచబడుదుమని నిరీక్షించుచున్నామే గాని, మరియొకని మేరలో చేరి, సిద్ధమైయున్నవి మావియైనట్టు అతిశయింపగోరము.

జెకర్యా 1:16 కాబట్టి యెహోవా సెలవిచ్చునదేమనగా వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగియున్నాను; అందులో నా మందిరము కట్టబడును; యెరూషలేముమీద శిల్పకారులు నూలు సాగలాగుదురు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.