Logo

యోబు అధ్యాయము 38 వచనము 24

యోబు 38:12 అరుణోదయము భూమి దిగంతములవరకు వ్యాపించునట్లును

యోబు 38:13 అది దుష్టులను తనలోనుండకుండ దులిపివేయునట్లును నీవెప్పుడైన ఉదయమును కలుగజేసితివా? అరుణోదయమునకు దాని స్థలమును తెలిపితివా?

యోనా 4:8 మరియు ఎండకాయగా దేవుడు వేడిమిగల తూర్పుగాలిని రప్పించెను. యోనా తలకు ఎండదెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రదుకుటకంటె చచ్చుట నాకు మేలనుకొనెను.

మత్తయి 24:27 మెరుపు తూర్పున పుట్టి పడమటివరకు ఏలాగు కనబడునో ఆలాగే మనుష్యకుమారుని రాకడయు నుండును.

యోబు 28:7 ఆ త్రోవ యే క్రూరపక్షికైనను తెలియదు డేగ కన్నులు దాని చూడలేదు

యోబు 37:15 దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవలెనని యెట్లు తీర్మానము చేయునో నీకు తెలియునా?

కీర్తనలు 135:7 భూదిగంతములనుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే. వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే తన నిధులలోనుండి గాలిని ఆయన బయలువెళ్లజేయును.

కీర్తనలు 147:8 ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు భూమికొరకు వర్షము సిద్ధపరచువాడు పర్వతములమీద గడ్డి మొలిపించువాడు