Logo

యోబు అధ్యాయము 42 వచనము 13

యోబు 1:2 అతనికి ఏడుగురు కుమారులును ముగ్గురు కుమార్తెలును కలిగిరి.

కీర్తనలు 107:41 అట్టి దరిద్రుల బాధను పొగొట్టి వారిని లేవనెత్తెను వాని వంశమును మందవలె వృద్ధిచేసెను.

కీర్తనలు 127:3 కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే

యెషయా 49:20 నీవు సంతానహీనురాలవైనప్పుడు నీకు పుట్టిన కుమారులు ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది. ఇంక విశాలమైన స్థలము మాకిమ్మని నీ చెవులలో చెప్పుదురు.

యోబు 5:25 మరియు నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబికులు భూమిమీద పచ్చికవలె విస్తరించుదురనియు నీకు తెలియును.

యోబు 8:7 అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగానుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు.

యోబు 18:19 వారి ప్రజలలో వారికి పుత్రులైనను పౌత్రులైనను ఉండరు వారు నివసించిన స్థలములో తప్పించుకొనినవాడు ఒకడైనను ఉండడు.

యోబు 29:5 సర్వశక్తుడు ఇంకను నాకు తోడైయుండెను నా పిల్లలు నా చుట్టునుండిరి