Logo

యోబు అధ్యాయము 42 వచనము 15

కీర్తనలు 144:12 మా కుమారులు తమ యౌవన కాలమందు ఎదిగిన మొక్కలవలె ఉన్నారు మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూలకంబములవలె ఉన్నారు.

అపోస్తలులకార్యములు 7:20 ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్యసుందరుడై తన తండ్రి యింట మూడు నెలలు పెంచబడెను.

సంఖ్యాకాండము 27:7 నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి అధీనముచేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెందచేయవలెను.

యెహోషువ 15:18 మరియు ఆమె తన పెనిమిటి యింటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచినీకేమి కావలెనని ఆమె నడిగెను.

యెహోషువ 15:19 అందుకామెనాకు దీవెన దయచేయుము; నీవు నాకు దక్షిణభూమి యిచ్చి యున్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయుమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను.

యెహోషువ 18:4 ప్రతి గోత్రమునుండి ముగ్గురేసి మనుష్యులను నాయొద్దకు రప్పించినయెడల నేను వారిని పంపెదను; వారు లేచి దేశ సంచారము చేయుచు ఆ యా స్వాస్థ్యములచొప్పున దాని వివరమును వ్రాసి నాయొద్దకు తీసికొనివచ్చెదరు.

సంఖ్యాకాండము 36:2 ఆ దేశమును వంతుచీట్లచొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా ఇయ్యవలెనని యెహోవా మా యేలినవానికాజ్ఞాపించెను. మరియు మా సహోదరుడైన సెలోపెహాదు స్వాస్థ్యమును అతని కుమార్తెలకు ఇయ్యవలెనని మా యేలినవాడు యెహోవాచేత ఆజ్ఞనొందెను.