Logo

సామెతలు అధ్యాయము 16 వచనము 9

సామెతలు 15:16 నెమ్మదిలేకుండ విస్తారమైన ధనముండుటకంటె యెహోవాయందలి భయభక్తులతో కూడ కొంచెము కలిగియుండుట మేలు.

కీర్తనలు 37:16 నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధనసమృద్ధికంటె శ్రేష్టము.

1తిమోతి 6:6 సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమైయున్నది.

1తిమోతి 6:7 మనమీలోకములోనికి ఏమియు తేలేదు, దీనిలోనుండి ఏమియు తీసికొని పోలేము.

1తిమోతి 6:8 కాగా అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొంది యుందము.

1తిమోతి 6:9 ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును.

సామెతలు 21:6 అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దానిని కోరువారు మరణమును కోరుకొందురు.

సామెతలు 21:7 భక్తిహీనులు న్యాయము చేయనొల్లరు వారు చేయు బలాత్కారము వారిని కొట్టుకొనిపోవును.

యిర్మియా 17:11 న్యాయవిరోధముగా ఆస్తి సంపాదించుకొనువాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజుపిట్టవలె నున్నాడు; సగము ప్రాయములో వాడు దానిని విడువవలసి వచ్చును; అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనబడును.

మీకా 6:10 అన్యాయము చేయువారి యిండ్లలో అన్యాయముచేత సంపాదించిన సొత్తులును, చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నవి గదా.

కీర్తనలు 119:141 నేను అల్పుడను నిరాకరింపబడినవాడను అయినను నీ ఉపదేశములను నేను మరువను.

సామెతలు 12:27 సోమరి వేటాడినను పట్టుకొనడు చురుకుగా నుండుట గొప్ప భాగ్యము.

సామెతలు 15:6 నీతిమంతుని యిల్లు గొప్ప ధననిధి భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము.

సామెతలు 19:1 బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాటలాడువానికంటె యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు.

సామెతలు 28:6 వంచకుడై ధనము సంపాదించిన వానికంటె యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి.

ప్రసంగి 4:6 శ్రమయును గాలికైన యత్నములును రెండుచేతులనిండ నుండుటకంటె ఒకచేతినిండ నెమ్మదికలిగి యుండుట మేలు.