Logo

సామెతలు అధ్యాయము 16 వచనము 25

సామెతలు 12:18 కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము.

సామెతలు 15:23 సరిగా ప్రత్యుత్తరమిచ్చినవానికి దానివలన సంతోషము పుట్టును సమయోచితమైన మాట యెంత మనోహరము!

సామెతలు 15:26 దురాలోచనలు యెహోవాకు హేయములు దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు.

సామెతలు 23:16 నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును.

సామెతలు 25:11 సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్లెములలో నుంచబడిన బంగారు పండ్లవంటిది.

సామెతలు 25:12 బంగారు కర్ణభూషణమెట్టిదో అపరంజి ఆభరణమెట్టిదో వినువాని చెవికి జ్ఞానముగల ఉపదేశకుడు అట్టివాడు.

సామెతలు 27:9 తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయములోనుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును.

ద్వితియోపదేశాకాండము 32:2 నా ఉపదేశము వానవలె కురియును నా వాక్యము మంచువలెను లేతగడ్డిమీద పడు చినుకులవలెను పచ్చికమీద కురియు వర్షమువలెను ఉండును.

పరమగీతము 4:11 ప్రాణేశ్వరీ, నీ పెదవులు తేనియలొలుకుచున్నట్టున్నవి నీ జిహ్వక్రింద మధుక్షీరములు కలవు నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసనవలె నున్నది.

యోహాను 20:19 ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, తాము కూడియున్న యింటి తలుపులు మూసికొనియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను.

యోహాను 20:20 ఆయన ఆలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి.

యోహాను 20:21 అప్పుడు యేసు మరల మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను.

సామెతలు 24:13 నా కుమారుడా, తేనె త్రాగుము అది రుచిగలది గదా తేనెపట్టు తినుము అది నీ నాలుకకు తీపియే గదా.

సామెతలు 24:14 నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలిసికొనుము అది నీకు దొరికినయెడల ముందుకు నీకు మంచిగతి కలుగును నీ ఆశ భంగము కానేరదు.

కీర్తనలు 19:10 అవి బంగారుకంటెను విస్తారమైన మేలిమి బంగారుకంటెను కోరదగినవి తేనెకంటెను జుంటితేనె ధారలకంటెను మధురమైనవి.

కీర్తనలు 119:103 నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనెకంటె తీపిగా నున్నవి.

యిర్మియా 15:16 నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని; సైన్యములకధిపతివగు యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి.

సామెతలు 3:8 అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ యెముకలకు సత్తువయు కలుగును.

సామెతలు 4:22 దొరికినవారికి అవి జీవమును వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును.

యోబు 4:4 నీ మాటలు తొట్రిల్లువానిని ఆదుకొనియుండెను. క్రుంగిపోయిన మోకాళ్లు గలవానిని నీవు బలపరచితివి.

సామెతలు 12:25 ఒకని హృదయములోని విచారము దాని క్రుంగజేయును దయగల మాట దాని సంతోషపెట్టును.

సామెతలు 15:4 సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో కుటిలత యుండినయెడల ఆత్మకు భంగము కలుగును.

సామెతలు 16:21 జ్ఞాన హృదయుడు వివేకి యనబడును రుచిగల మాటలు పలుకుటవలన విద్య యెక్కువగును.

సామెతలు 20:15 బంగారును విస్తారమైన ముత్యములును కలవు. తెలివినుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు.

సామెతలు 31:26 జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును.

పరమగీతము 7:9 నీ నోరు శ్రేష్ట ద్రాక్షారసమువలె నున్నది ఆ శ్రేష్ఠ ద్రాక్షారసము నా ప్రియునికి మధుర పానీయము అది నిద్రితుల యధరములు ఆడజేయును.

ప్రకటన 10:10 అంతట నేను ఆ చిన్న పుస్తకమును దూతచేతిలోనుండి తీసికొని దానిని తినివేసితిని; అది నా నోటికి తేనెవలె మధురముగా ఉండెను గాని నేను దానిని తినివేసిన తరువాత నా కడుపుకు చేదాయెను