Logo

సామెతలు అధ్యాయము 26 వచనము 19

సామెతలు 7:23 తనకు ప్రాణహానికరమైనదని యెరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లును వాని గుండెను అంబు చీల్చువరకు వాడు దానివెంట పోయెను.

సామెతలు 25:18 తన పొరుగువానిమీద కూటసాక్ష్యము పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు.

ఆదికాండము 49:23 విలుకాండ్రు అతని వేధించిరి వారు బాణములను వేసి అతని హింసించిరి.

2సమూయేలు 2:14 అబ్నేరు లేచి మన యెదుట యౌవనులు మల్లచేష్టలు చేయుదురా అని యోవాబుతో అనగా యోవాబువారు చేయవచ్చుననెను.

సామెతలు 10:23 చెడుపనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా నున్నది వివేకికి జ్ఞానపరిశ్రమ చేయుట అట్టిదే.

సామెతలు 14:9 మూఢులు చేయు అపరాధపరిహారార్థబలి వారిని అపహాస్యము చేయును యథార్థవంతులు ఒకరియందు ఒకరు దయచూపుదురు.

సామెతలు 15:21 బుద్ధిలేనివానికి మూఢత సంతోషకరము వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును.

యిర్మియా 11:15 దుర్వ్యాపారము జరిగించిన నా ప్రియురాలికి నా మందిరముతో నిమిత్తమేమి? మ్రొక్కుబళ్లచేతను ప్రతిష్ఠిత మాంసము తినుటచేతను నీకు రావలసిన కీడు నీవు పోగొట్టుకొందువా? ఆలాగైతే నీవు ఉత్సహించుదువు.