Logo

సామెతలు అధ్యాయము 26 వచనము 21

సామెతలు 26:22 కొండెగాని మాటలు రుచిగల పదార్థములవంటివి అవి లోకడుపులోనికి దిగిపోవును.

సామెతలు 16:28 మూర్ఖుడు కలహము పుట్టించును కొండెగాడు మిత్రభేదము చేయును.

సామెతలు 22:10 తిరస్కారబుద్ధి గలవాని తోలివేసినయెడల కలహములు మానును పోరు తీరి అవమానము మానిపోవును.

యాకోబు 3:6 నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును; అది నరకముచేత చిచ్చు పెట్టబడును.

1సమూయేలు 24:9 సౌలుతో ఇట్లనెను దావీదు నీకు కీడుచేయ నుద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు?

కీర్తనలు 41:7 నన్ను ద్వేషించువారందరు కూడి నామీద గుసగుస లాడుచున్నారు నశింపజేయవలెనని వారు నాకు కీడుచేయ నాలోచించుచున్నారు.

సామెతలు 6:19 లేనివాటిని పలుకు అబద్ధసాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును.

సామెతలు 11:13 కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును.

సామెతలు 18:8 కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు అవి లోకడుపులోనికి దిగిపోవును.

సామెతలు 20:19 కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును కావున వదరుబోతుల జోలికి పోకుము.

సామెతలు 25:23 ఉత్తరపు గాలి వాన పుట్టించును కొండెగాని నాలుక కోపదృష్టి కలిగించును.

రోమీయులకు 1:29 అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము వైరమనువాటితో నిండినవారై

ఎఫెసీయులకు 4:31 సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.