Logo

సామెతలు అధ్యాయము 29 వచనము 12

సామెతలు 12:16 మూఢుడు కోపపడునది నిమిషములోనే బయలుపడును వివేకి నిందను వెల్లడిపరచక యూరకుండును.

సామెతలు 12:23 వివేకియైనవాడు తన విద్యను దాచిపెట్టును అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు.

సామెతలు 14:33 తెలివిగలవాని హృదయమందు జ్ఞానము సుఖనివాసము చేయును బుద్ధిహీనుల అంతరంగములోనున్నది బయలుపడును

న్యాయాధిపతులు 16:17 అప్పుడతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజేసినేను నా తల్లిగర్భమునుండి పుట్టి నది మొలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడనై యున్నాను, నా తలమీదికి మంగలకత్తి రాలేదు, నాకు క్షౌరముచేసినయెడల నా బలము నాలోనుండి తొలగి పోయి యితర మనుష్యులవలె అవుదునని ఆమెతో అనెను.

ఆమోసు 5:13 ఇది చెడుకాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును.

మీకా 7:5 స్నేహితునియందు నమ్మిక యుంచవద్దు, ముఖ్యస్నేహితుని నమ్ముకొనవద్దు, నీ కౌగిటిలో పండుకొనియున్న దానియెదుట నీ పెదవుల ద్వారమునకు కాపుపెట్టుము.

1సమూయేలు 10:16 సౌలు గార్దభములు దొరికినవని అతడు చెప్పెనని తన పినతండ్రితో అనెను గాని రాజ్యమునుగూర్చి సమూయేలు చెప్పిన మాటను తెలుపలేదు.

ఎస్తేరు 5:4 ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచినయెడల నేను రాజుకొరకు సిద్ధము చేయించిన విందునకు రాజవైన తామును హామానును నేడు రావలెనని కోరుచున్నానని ప్రత్యుత్తరమిచ్చెను.

సామెతలు 15:28 నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును భక్తిహీనుల నోరు చెడ్డమాటలు కుమ్మరించును

సామెతలు 29:20 ఆతురపడి మాటలాడువాని చూచితివా? వానికంటె మూర్ఖుడు సుళువుగా గుణపడును.