Logo

సామెతలు అధ్యాయము 29 వచనము 21

సామెతలు 29:11 బుద్ధిహీనుడు తన కోపమంత కనుపరచును జ్ఞానము గలవాడు కోపము అణచుకొని దానిని చూపకుండును.

ప్రసంగి 5:2 నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనియ్యక నీ నోటిని కాచుకొమ్ము; దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమిమీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను.

యాకోబు 1:19 నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదా నించువాడునై యుండవలెను.

సామెతలు 14:29 దీర్ఘశాంతము గలవాడు మహా వివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును.

సామెతలు 21:5 శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు తాలిమి లేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును

సామెతలు 26:12 తన దృష్టికి జ్ఞానిననుకొనువానిని చూచితివా? వానిని గుణపరచుటకంటె మూర్ఖుని గుణపరచుట సుళువు.

యోబు 20:2 ఆలాగున నీవు చెప్పినందుకు నాయందలి ఆతురత తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచియున్నది.

సామెతలు 15:28 నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును భక్తిహీనుల నోరు చెడ్డమాటలు కుమ్మరించును