Logo

ప్రసంగి అధ్యాయము 2 వచనము 9

1రాజులు 9:14 హీరాము రెండువందల నలువది మణుగుల బంగారమును రాజునకు పంపించెను.

1రాజులు 9:28 వారు ఓఫీరను స్థలమునకు పోయి అచ్చటనుండి యెనిమిది వందల నలువది మణుగుల బంగారమును రాజైన సొలొమోను నొద్దకు తీసికొని వచ్చిరి.

1రాజులు 10:10 మరియు ఆమె రాజునకు రెండువందల నలువది మణుగుల బంగార మును, బహు విస్తారమైన గంధవర్గమును, రత్నములను ఇచ్చెను. షేబదేశపు రాణి రాజైన సొలొమోనునకు ఇచ్చిన గంధ వర్గములంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు.

1రాజులు 14:21 యూదాదేశమందు సొలొమోను కుమారుడైన రెహబాము ఏలుచుండెను. రెహబాము నలువదియొక సంవత్సరముల వాడైనప్పుడు ఏలనారంభించెను. తన నామము నుంచుటకై ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలోనుండి యెహోవా కోరుకొనిన యెరూషలేమను పట్టణమందు అతడు పదునేడు సంవత్సరములు ఏలెను; అతని తల్లి అమ్మోనీయురాలు, ఆమె పేరు నయమా.

1రాజులు 14:22 యూదావారు యెహోవా దృష్టికి కీడుచేసి తమ పితరులు చేసినదానంతటిని మించునట్లుగా పాపము చేయుచు ఆయనకు రోషము పుట్టించిరి.

1రాజులు 14:27 రాజైన రెహబాము వీటికి మారుగా ఇత్తడి డాళ్లను చేయించి, రాజనగరు ద్వారపాలకులైన తన దేహసంరక్షకుల అధిపతుల వశము చేసెను.

2దినవృత్తాంతములు 9:11 ఆ చందనపు మ్రానులచేత రాజు యెహోవా మందిరమునకును రాజనగరునకును సౌపానములను, గాయకులకు తంబురలను సితారాలను చేయించెను, అటువంటి పని అంతకుముందు యూదాదేశమందు ఎవ్వరును చూచియుండలేదు.

2దినవృత్తాంతములు 9:15 రాజైన సొలొమోను సాగగొట్టిన బంగారముతో అలుగులుగల రెండువందల డాళ్లను చేయించెను; ఒక్కొక డాలునకు ఆరువందల తులముల బంగారము పట్టెను.

2దినవృత్తాంతములు 9:16 మరియు సాగగొట్టిన బంగారముతో మూడువందల కేడెములను చేయించెను; ఒక్కొక కేడెమునకు మూడువందల తులముల బంగారము పట్టెను; వాటిని రాజు లెబానోను అరణ్యపు నగరునందుంచెను.

2దినవృత్తాంతములు 9:17 మరియు రాజు దంతముతో ఒక గొప్ప సింహాసనము చేయించి ప్రశస్తమైన బంగారముతో దాని పొదిగించెను.

2దినవృత్తాంతములు 9:18 ఆ సింహాసనమునకు దానితో కలిసియున్న ఆరు బంగారపు సోపానములును సింహాసనమునకు కట్టియున్న బంగారపు పాదపీఠమును ఉండెను, కూర్చుండుచోటికి ఇరుప్రక్కల ఊతలుండెను, ఊతలదగ్గర రెండు సింహములుండెను;

2దినవృత్తాంతములు 9:19 ఆ యారు సోపానములమీద ఇరుప్రక్కల పండ్రెండు సింహములు నిలిచియుండెను, ఏ రాజ్యమందైనను అటువంటి పని చేయబడలేదు.

2దినవృత్తాంతములు 9:20 మరియు రాజైన సొలొమోనునకున్న పానపాత్రలన్నియును బంగారపువై యుండెను; లెబానోను అరణ్యపు నగరుననున్న ఉపకరణములన్నియు బంగారముతో చేసినవి; హీరాముయొక్క పనివారితో కూడ రాజు ఓడలు తర్షీషుకు పోయి మూడు సంవత్సరములకు ఒక మారు బంగారము, వెండి, యేనుగు దంతము, కోతులు, నెమళ్లు అను సరకులతో వచ్చుచుండెను గనుక

2దినవృత్తాంతములు 9:21 సొలొమోను దినములలో వెండి యెన్నికకు రానిదాయెను

2సమూయేలు 19:35 నేటికి నాకు ఎనుబది యేండ్లాయెను. సుఖదుఃఖములకున్న భేదమును నేను గుర్తింపగలనా? అన్నపానముల రుచి నీ దాసుడనైన నేను తెలిసికొనగలనా? గాయకుల యొక్కయు గాయకురాండ్ర యొక్కయు స్వరము నాకు వినబడునా? కావున నీ దాసుడనగు నేను నా యేలిన వాడవును రాజవునగు నీకు ఎందుకు భారముగా నుండవలెను?

ఎజ్రా 2:65 వీరుగాక వీరి దాసులును దాసురాండ్రును ఏడు వేల మూడువందల ముప్పది యేడుగురు. మరియు వారిలో గాయకులును గాయకురాండ్రును రెండువందలమంది యుండిరి.

1దినవృత్తాంతములు 25:1 మరియు దావీదును సైన్యాధిపతులును ఆసాపు హేమాను యెదూతూను అనువారి కుమారులలో కొందరిని సేవనిమిత్తమై ప్రత్యేకపరచి, సితారాలను స్వరమండలములను తాళములను వాయించుచు ప్రకటించునట్లుగా నియమించిరి ఈ సేవా వృత్తినిబట్టి యేర్పాటైన వారి సంఖ్య యెంతయనగా

1దినవృత్తాంతములు 25:6 వీరందరు ఆసాపునకును యెదూతూనునకును హేమానునకును రాజు చేసియున్న కట్టడ ప్రకారము యెహోవా యింటిలో తాళములు స్వర మండలములు సితారాలు వాయించుచు గానము చేయుచు, తమ తండ్రి చేతిక్రింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండిరి.

యోబు 21:11 వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురు వారి పిల్లలు నటనము చేయుదురు.

యోబు 21:12 తంబుర స్వరమండలములను పట్టుకొని వాయించుదురు సానికనాదము విని సంతోషించుదురు.

కీర్తనలు 150:3 బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోను సితారాతోను ఆయనను స్తుతించుడి.

కీర్తనలు 150:4 తంబురతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి. తంతివాద్యములతోను పిల్లనగ్రోవితోను ఆయనను స్తుతించుడి.

కీర్తనలు 150:5 మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీరధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి.

దానియేలు 3:5 ఏమనగా, బాకా పిల్లంగ్రోవి పెద్దవీణ సుంఫోనీయ వీణ విపంచిక సకలవిధములగు వాద్యధ్వనులు మీకు వినబడునప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ యెదుట సాగిలపడి నమస్కరించుడి.

దానియేలు 3:7 సకలజనులకు బాకా పిల్లంగ్రోవి పెద్దవీణ వీణ సుంఫోనీయ విపంచిక సకలవిధములగు వాద్యధ్వనులు వినబడగా ఆ జనులును దేశస్థులును ఆ యా భాషలు మాటలాడువారును సాగిలపడి, రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేసిరి.

దానియేలు 3:15 బాకాను పిల్లంగ్రోవిని పెద్దవీణను వీణను సుంఫోనీయను విపంచికను సకలవిధములగు వాద్యధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి, నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన యెడల సరే మీరు నమస్కరింపని యెడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండములో మీరు వేయబడుదురు; నాచేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడ నున్నాడు?

ఆమోసు 6:5 స్వరమండలముతో కలిసి పిచ్చిపాటలు పాడుచు, దావీదువలెనే వాయించు వాద్యములను కల్పించుకొందురు.

2దినవృత్తాంతములు 8:18 హీరాము తన పనివారిద్వారా ఓడలను ఓడ నడుపుటయందు యుక్తి గల పనివారిని పంపెను. వీరు సొలొమోను పనివారితో కూడ ఓఫీరునకు పోయి అక్కడనుండి తొమ్మిదివందల మణుగుల బంగారమును ఎక్కించుకొని రాజైన సొలొమోను నొద్దకు తీసికొనివచ్చిరి.

కీర్తనలు 39:6 మనుష్యులు వట్టి నీడవంటివారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే గదా వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు.

దానియేలు 6:18 అంతట రాజు తన నగరునకు వెళ్లి ఆ రాత్రి అంత ఉపవాసముండి నాట్యవాయిద్యములను జరుగనియ్యలేదు; అతనికి నిద్రపట్టకపోయెను.