Logo

ప్రసంగి అధ్యాయము 2 వచనము 14

ప్రసంగి 7:11 జ్ఞానము స్వాస్థ్యమంత యుపయోగము; సూర్యుని క్రింద బ్రదుకువారికి అది లాభకరము.

ప్రసంగి 7:12 జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము; అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును; ఇదే జ్ఞానమువలన కలుగు లాభము.

ప్రసంగి 9:16 కాగా నేనిట్లనుకొంటిని-బలముకంటె జ్ఞానము శ్రేష్ఠమేగాని బీదవారి జ్ఞానము తృణీకరింపబడును, వారి మాటలు ఎవరును లక్ష్యము చేయరు.

సామెతలు 4:5 జ్ఞానము సంపాదించుకొనుము బుద్ధి సంపాదించుకొనుము నా నోటి మాటలను మరువకుము. వాటినుండి తొలగిపోకుము.

సామెతలు 4:6 జ్ఞానమును విడువక యుండినయెడల అది నిన్ను కాపాడును దాని ప్రేమించినయెడల అది నిన్ను రక్షించును.

సామెతలు 4:7 జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము.

సామెతలు 16:16 అపరంజిని సంపాదించుటకంటె జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్ఠము వెండిని సంపాదించుటకంటె తెలివిని సంపాదించుట ఎంతో మేలు.

మలాకీ 3:18 అప్పుడు నీతిగలవారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించువారెవరో ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు.

మలాకీ 4:1 ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును; గర్విష్ఠులందరును దుర్మార్గులందరును కొయ్యకాలువలె ఉందురు, వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండ, రాబోవుదినము అందరిని కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

మలాకీ 4:2 అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతిసూర్యుడు ఉదయించును; అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు.

ప్రసంగి 11:7 వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నులకింపుగా నున్నది.

కీర్తనలు 119:105 (నూన్‌) నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునైయున్నది.

కీర్తనలు 119:130 నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును అవి తెలివిలేనివారికి తెలివి కలిగించును

సామెతలు 4:18 పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును,

సామెతలు 4:19 భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము తాము దేనిమీద పడునది వారికి తెలియదు.

మత్తయి 6:23 నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై యుండును; నీలోనున్న వెలుగు చీకటియై యుండినయెడల ఆ చీకటి యెంతో గొప్పది.

లూకా 11:34 నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక, నీ కన్ను తేటగానుంటె నీ దేహమంతయు వెలుగుమయమై యుండును; అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై యుండును.

లూకా 11:35 కాబట్టి నీలోనుండు వెలుగు చీకటియై యుండకుండ చూచుకొనుము.

ఎఫెసీయులకు 5:8 మీరు పూర్వమందు చీకటియై యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగైయున్నారు.

ఆదికాండము 1:4 వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను; దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను.

ప్రసంగి 8:1 జ్ఞానులతో సములైనవారెవరు? జరుగువాటి భావమును ఎరిగినవారెవరు? మనుష్యుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దానివలన వారి మోటుతనము మార్చబడును.

యిర్మియా 9:23 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమునుబట్టియు శూరుడు తన శౌర్యమునుబట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమునుబట్టి అతిశయింపకూడదు.

దానియేలు 6:3 ఈ దానియేలు అతిశ్రేష్ఠమైన బుద్ధిగలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొందియుండెను గనుక రాజ్యమంతటిమీద అతని నియమింపవలెనని రాజుద్దేశించెను.