Logo

మత్తయి అధ్యాయము 18 వచనము 3

మత్తయి 19:13 అప్పుడు ఆయన వారిమీద చేతులుంచి ప్రార్థన చేయవలెనని కొందరు చిన్నపిల్లలను ఆయనయొద్దకు తీసికొనివచ్చిరి.

మత్తయి 19:14 ఆయన శిష్యులు, తీసికొనివచ్చినవారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను అటంకపరచక వారిని నాయొద్దకు రానియ్యుడి; పరలోకరాజ్యము ఈలాటివారిదని వారితో చెప్పి

1రాజులు 3:7 నా దేవా యెహోవా, నీవు నా తండ్రియైన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించియున్నావు; అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు;

యిర్మియా 1:7 యెహోవా నాకీలాగు సెలవిచ్చెను నేను బాలుడననవద్దు; నేను నిన్ను పంపువారందరియొద్దకు నీవు పోవలెను, నీకాజ్ఞాపించిన సంగతులన్నియు చెప్పవలెను.

మార్కు 9:36 యొక చిన్నబిడ్డను తీసికొని వారి మధ్యను నిలువబెట్టి, వానిని ఎత్తి కౌగిలించుకొని

మార్కు 9:37 ఇట్టి చిన్నబిడ్డలలో ఒకనిని నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను గాక నన్ను పంపినవానిని చేర్చుకొనునని వారితో చెప్పెను.

కీర్తనలు 34:11 పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవాయందలి భయభక్తులు మీకు నేర్పెదను.

మత్తయి 7:13 ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై యున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు.

లూకా 9:47 యేసు వారి హృదయాలోచన ఎరిగి, ఒక చిన్న బిడ్డను తీసికొని తనయొద్ద నిలువబెట్టి.