Logo

మత్తయి అధ్యాయము 18 వచనము 32

కీర్తనలు 119:136 జనులు నీ ధర్మశాస్త్రము ననుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది.

కీర్తనలు 119:158 ద్రోహులను చూచి నేను అసహ్యించుకొంటిని నీవిచ్చిన మాటను వారు లక్ష్యపెట్టరు.

యిర్మియా 9:1 నా జనులలో హతమైనవారినిగూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచునట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండును గాక.

మార్కు 3:5 ఆయన వారి హృదయకాఠిన్యమునకు దుఃఖపడి, కోపముతో వారిని కలయచూచి నీ చెయ్యి చాపుమని ఆ మనుష్యునితో చెప్పెను; వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను.

లూకా 19:41 ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై యేడ్చి

రోమీయులకు 9:1 నాకు బహు దుఃఖమును, నా హృదయములో మానని వేదనయు కలవు.

రోమీయులకు 9:2 క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు.

రోమీయులకు 9:3 పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతోకూడ సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైనయెడల, దేహసంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తునుండి వేరై శాపగ్రస్తుడనై యుండగోరుదును.

రోమీయులకు 12:15 సంతోషించు వారితో సంతోషించుడి;

2కొరిందీయులకు 11:21 మేము బలహీనులమైయున్నట్టు అవమానముగా మాటలాడుచున్నాను. ఏ విషయమందు ఎవడైన ధైర్యము కలిగియున్నాడో, ఆ విషయమందు నేను కూడ ధైర్యము కలిగినవాడను; అవివేకముగా మాటలాడుచున్నాను సుమా.

హెబ్రీయులకు 13:3 మీరును వారితో కూడ బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసికొనుడి. మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టములననుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసికొనుడి.

ఆదికాండము 37:2 యాకోబు వంశావళి యిది. యోసేపు పదునేడేండ్లవాడై తన సహోదరులతో కూడ మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారులయొద్దను జిల్పా కుమారులయొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమునుగూర్చిన సమాచారము వారి తండ్రియొద్దకు తెచ్చుచుండువాడు.

లూకా 14:21 అప్పుడా దాసుడు తిరిగివచ్చి యీ మాటలు తన యజమానునికి తెలియజేయగా, ఆ యింటి యజమానుడు కోపపడి నీవు త్వరగా పట్టణపు వీధులలోనికిని సందులలోనికిని వెళ్లి, బీదలను అంగహీనులను కుంటివారిని గృడ్డివారిని ఇక్కడికి తోడ్కొనిరమ్మని ఆ దాసునితో చెప్పెను

హెబ్రీయులకు 13:17 మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దుఃఖముతో ఆ పని చేసినయెడల మీకు నిష్‌ప్రయోజనము గనుక దుఃఖముతో కాక, ఆనందముతో చేయునట్లు వారి మాట విని, వారికి లోబడియుండుడి.

1దినవృత్తాంతములు 19:5 ఆ మనుష్యులు ఇంటికి వచ్చుచుండగా కొందరువచ్చి వారిని గూర్చిన వార్త దావీదునకు తెలియజేసిరి; వారు బహు లజ్జాక్రాంతులై యుండిరిగనుక వారికి ఎదురుగా మనుష్యులను పంపి మీ గడ్డములు పెరుగుదనుక మీరు యెరికోలో ఉండి తరువాత రండని రాజు వారికి వర్తమానమంపెను.