Logo

యోహాను అధ్యాయము 19 వచనము 21

యోహాను 19:13 పిలాతు ఈ మాటలు విని, యేసును బయటికి తీసికొనివచ్చి, రాళ్లు పరచిన స్థలమందు న్యాయపీఠముమీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు.

యోహాను 5:2 యెరూషలేములో గొఱ్ఱల ద్వారము దగ్గర, హెబ్రీ భాషలో బేతెస్ద అనబడిన యొక కోనేరు కలదు, దానికి అయిదు మంటపములు కలవు.

అపోస్తలులకార్యములు 21:40 అతడు సెలవిచ్చిన తరువాత పౌలు మెట్లమీద నిలువబడి జనులకు చేసైగ చేసెను. వారు నిశ్చబ్దముగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో ఇట్లనెను

అపోస్తలులకార్యములు 22:2 అతడు హెబ్రీ భాషలో మాటలాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి. అప్పుడతడు ఈలాగు చెప్పసాగెను.

అపోస్తలులకార్యములు 26:14 మేమందరమును నేలపడినప్పుడు సౌలా సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని.

ప్రకటన 16:16 ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను; తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిసమొలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడు కొనువాడు ధన్యుడు.

అపోస్తలులకార్యములు 21:37 వారు పౌలును కోటలోనికి తీసికొనిపోవనై యుండగా అతడు పై యధికారిని చూచి నేను నీతో ఒకమాట చెప్పవచ్చునా? అని అడిగెను. అందుకతడు గ్రీకు భాష నీకు తెలియునా?

ప్రకటన 9:11 పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు; హెబ్రీ భాషలో వానికి అబద్దోనని పేరు, గ్రీసు దేశపు భాషలో వానిపేరు అపొల్లుయోను.

మార్కు 16:6 అందుకతడు కలవరపడకుడి సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు; ఆయన లేచియున్నాడు, ఇక్కడ లేడు; వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి.