Logo

యోహాను అధ్యాయము 19 వచనము 30

మత్తయి 27:34 చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను.

మత్తయి 27:48 వెంటనే వారిలో ఒకడు పరుగెత్తికొని పోయి, స్పంజీ తీసికొని చిరకాలో ముంచి, రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను;

మార్కు 15:36 ఒకడు పరుగెత్తిపోయి యొక స్పంజీ చిరకాలోముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాళుడి; ఏలీయా వీని దింప వచ్చునేమో చూతమనెను.

లూకా 23:36 అంతట సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి

నిర్గమకాండము 12:22 మరియు హిస్సోపు కుంచె తీసికొని పళ్లెములో నున్న రక్తములో దాని ముంచి, ద్వారబంధపు పైకమ్మికిని రెండు నిలువుకమ్ములకును పళ్లెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలో నెవరును ఉదయమువరకు తన యింటి ద్వారమునుండి బయలువెళ్లకూడదు.

సంఖ్యాకాండము 19:18 తరువాత పవిత్రుడైన యొకడు హిస్సోపు తీసికొని ఆ నీళ్లలో ముంచి, ఆ గుడారముమీదను దానిలోని సమస్తమైన ఉపకరణములమీదను అక్కడనున్న మనుష్యులమీదను, ఎముకనేగాని నరకబడిన వానినేగాని శవమునేగాని సమాధినేగాని ముట్టినవానిమీదను దానిని ప్రోక్షింపవలెను.

1రాజులు 4:33 మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలోనుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటినిగూర్చి అతడు వ్రాసెను; మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జలచరములు అనువాటి నన్నిటినిగూర్చియు అతడు వ్రాసెను.

కీర్తనలు 51:7 నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమముకంటెను నేను తెల్లగానుండునట్లు నీవు నన్ను కడుగుము.

1రాజులు 12:15 జనులు చేసిన మనవిని రాజు ఈ ప్రకారము అంగీకరింపకపోయెను. షిలోనీయుడైన అహీయాద్వారా నెబాతు కుమారుడైన యరొబాముతో తాను పలికించిన మాట నెరవేర్చవలెనని యెహోవా ఈలాగున జరిగించెను.

కీర్తనలు 69:21 వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పియైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి.