Logo

అపోస్తలులకార్యములు అధ్యాయము 1 వచనము 25

అపోస్తలులకార్యములు 13:2 వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పనికొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను.

అపోస్తలులకార్యములు 13:3 అంతట వారు ఉపవాసముండి ప్రార్థనచేసి వారిమీద చేతులుంచి వారిని పంపిరి.

సామెతలు 3:5 నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము

సామెతలు 3:6 నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.

లూకా 6:12 ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి, దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను.

లూకా 6:13 ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి, వారిలో పండ్రెండుమందిని ఏర్పరచి, వారికి అపొస్తలులు అను పేరు పెట్టెను.

అపోస్తలులకార్యములు 15:8 మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి, వారినిగూర్చి సాక్ష్యమిచ్చెను.

సంఖ్యాకాండము 27:16 అతడు వారి యెదుట వచ్చుచు, పోవుచునుండి,

1సమూయేలు 16:7 అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను అతని రూపమును అతని యెత్తును లక్ష్యపెట్టకుము, మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు; నేను అతని త్రోసివేసియున్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.

1రాజులు 8:39 ప్రతి మనిషియొక్క హృదయము నీవెరుగుదువు గనుక నీవు ఆకాశమను నీ నివాసస్థలమందు విని, క్షమించి దయచేసి యెవరి ప్రవర్తననుబట్టి వారికి ప్రతిఫలమిచ్చి

1దినవృత్తాంతములు 28:9 సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రియొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగినవాడునై యున్నాడు. నీవు ఆయనను తెలిసికొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము,ఆయనను వెదకినయెడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించినయెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును.

1దినవృత్తాంతములు 29:17 నా దేవా, నీవు హృదయ పరిశోధనచేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును; నేనైతే యథార్థహృదయము గలవాడనై యివి యన్నియు మనఃపూర్వకముగా ఇచ్చియున్నాను; ఇప్పుడు ఇక్కడనుండు నీ జనులును నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను.

కీర్తనలు 7:9 హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా,

కీర్తనలు 44:21 హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా?

సామెతలు 15:11 పాతాళమును అగాధకూపమును యెహోవాకు కనబడుచున్నవి నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును గదా?

యిర్మియా 11:20 నీతినిబట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను, హృదయమును శోధించువాడు సైన్యములకధిపతియగు యెహోవాయే. యెహోవా, నా వ్యాజ్యెభారమును నీమీదనే వేయుచున్నాను; వారికి నీవు చేయు ప్రతిదండనను నన్ను చూడనిమ్ము.

యిర్మియా 17:10 ఒకని ప్రవర్తననుబట్టి వాని క్రియల ఫలముచొప్పున ప్రతికారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను.

యిర్మియా 20:12 సైన్యములకధిపతివగు యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడవు నీవే; అంతరింద్రియములను హృదయమును చూచువాడవు నీవే; నా వ్యాజ్యెమును నీకే అప్పగించుచున్నాను. నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూతును గాక

యోహాను 2:24 అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసికొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు

యోహాను 2:25 గనుక ఎవడును మనుష్యునిగూర్చి ఆయనకు సాక్ష్యమియ్య నక్కరలేదు.

యోహాను 21:17 మూడవసారి ఆయన యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా? అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను.

హెబ్రీయులకు 4:13 మరియు ఆయన దృష్టికి కనబడని సృష్ఠము ఏదియు లేదు. మనమెవనికి లెక్క యొప్పచెప్పవలసి యున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.

ప్రకటన 2:23 దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నియు తెలిసికొనును. మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను.

సంఖ్యాకాండము 16:5 తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకొనినవానిని తనయొద్దకు చేర్చుకొనును.

యెహోషువ 7:14 ఉదయమున మీ గోత్రముల వరుసనుబట్టి మీరు రప్పింపబడుదురు; అప్పుడు యెహోవా ఏ గోత్రమును సూచించునో అది వంశముల వరుసప్రకారము దగ్గరకు రావలెను; యెహోవా సూచించు వంశము కుటుంబములప్రకారము దగ్గరకు రావలెను; యెహోవా సూచించు కుటుంబము పురుషుల వరుసప్రకారము దగ్గరకు రావలెను.

యెహోషువ 18:8 ఆ మనుష్యులు లేచి ప్రయాణము కాగా యెహోషువ దేశ వివరమును వ్రాయుటకు వెళ్లబోవు వారితోమీరు ఆ దేశములో బడి నడుచుచు దాని వివరమును వ్రాసి నాయొద్దకు తిరిగి రండి; అప్పుడు నేను షిలోహులో మీకొరకు యెహోవా సన్నిధిని వంతుచీట్లు వేయించెద ననగా

యెహోషువ 22:22 దేవుళ్లలో యెహోవా దేవుడు, దేవుళ్లలో యెహోవాయే దేవుడు; సంగతి ఆయనకు తెలి యును, ఇశ్రాయేలీయులు తెలిసి కొందురు, ద్రోహముచేతనైనను యెహోవామీద తిరుగుబాటుచేతనైనను మేము ఈ పని చేసినయెడల నేడు మమ్ము బ్రదుకనియ్యకుడి.

1సమూయేలు 10:20 ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిని సమూయేలు సమకూర్చగా బెన్యామీను గోత్రము ఏర్పడెను.

1సమూయేలు 14:41 అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులకు దేవుడవైన యెహోవా, దోషిని కనుపరచుమని ప్రార్థింపగా సౌలు పేరటను యోనాతాను పేరటను చీటిపడెను గాని జనులు తప్పించుకొనిరి.

నెహెమ్యా 11:1 జనుల అధికారులు యెరూషలేములో నివాసము చేసిరి. మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణమగు యెరూషలేమునందు పదిమందిలో ఒకడు నివసించునట్లును, మిగిలిన తొమ్మండుగురు వేరు పట్టణములలో నివసించునట్లును చీట్లు వేసిరి.

మార్కు 3:14 వారు తనతో కూడ ఉండునట్లును దయ్యములను వెళ్లగొట్టు

మార్కు 11:3 ఎవడైనను మీరెందుకు ఈలాగు చేయుచున్నారని మిమ్మునడిగినయెడల అది ప్రభువునకు కావలసియున్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికితోలి పంపునని చెప్పి వారిని పంపెను.

యోహాను 15:16 మీరు నన్ను ఏర్పరచుకొనలేదు; మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకనుగ్రహించునట్లు మీరు వెళ్లి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని.

అపోస్తలులకార్యములు 6:6 వారిని అపొస్తలుల యెదుట నిలువబెట్టిరి; వీరు ప్రార్థనచేసి వారిమీద చేతులుంచిరి.

అపోస్తలులకార్యములు 15:7 సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడేర్పరచుకొనెనని మీకు తెలియును.

రోమీయులకు 8:27 మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మయొక్క మనస్సు ఏదో యెరుగును; ఏలయనగా ఆయన దేవుని చిత్తప్రకారము పరిశుద్దులకొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు.