Logo

అపోస్తలులకార్యములు అధ్యాయము 2 వచనము 13

అపోస్తలులకార్యములు 10:17 పేతురు తనకు కలిగిన దర్శనమేమైయుండునో అని తనలో తనకు ఎటుతోచక యుండగా, కొర్నేలి పంపిన మనుష్యులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలిసికొని, వాకిట నిలిచి యింటివారిని పిలిచి

అపోస్తలులకార్యములు 17:20 కొన్ని క్రొత్తసంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలిసికొనగోరుచున్నామని చెప్పిరి.

లూకా 15:26 దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగగా

లూకా 18:36 జనసమూహము దాటిపోవుచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా

మార్కు 12:11 ఇది ప్రభువువలననే కలిగెను ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను లేఖనము మీరు చదువలేదా? అని అడుగగా

అపోస్తలులకార్యములు 2:7 అంతట అందరు విభ్రాంతినొంది ఆశ్చర్యపడి ఇదిగో మాటలాడుచున్న వీరందరు గలిలయులు కారా?

అపోస్తలులకార్యములు 3:10 శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండినవాడు వీడే అని గుర్తెరిగి, వానికి జరిగినదానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి.

అపోస్తలులకార్యములు 5:24 అంతట దేవాలయపు అధిపతియు ప్రధానయాజకులును ఆ మాటలు విని ఇది యేమవునో అని వారి విషయమై యెటుతోచక యుండిరి.

అపోస్తలులకార్యములు 9:21 వినినవారందరు విభ్రాంతినొంది, యెరూషలేములో ఈ నామమునుబట్టి ప్రార్థన చేయువారిని నాశనము చేసినవాడితడే కాడా? వారిని బంధించి ప్రధానయాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికికూడ వచ్చియున్నాడని చెప్పుకొనిరి.