Logo

అపోస్తలులకార్యములు అధ్యాయము 5 వచనము 1

అపోస్తలులకార్యములు 4:34 భూములైనను ఇండ్లయినను కలిగినవారందరు వాటిని అమ్మి, అమ్మిన వాటి వెలతెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టుచు వచ్చిరి.

అపోస్తలులకార్యములు 4:35 వారు ప్రతివానికి వానివాని అక్కరకొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువ లేకపోయెను.

అపోస్తలులకార్యములు 5:1 అననీయ అను ఒక మనుష్యుడు తన భార్యయైన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను.

అపోస్తలులకార్యములు 5:2 భార్య యెరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టెను.

మత్తయి 19:29 నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్కచెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును నూరురెట్లు పొందును; ఇదిగాక నిత్యజీవమును స్వతంత్రించుకొనును.

లేవీయకాండము 25:34 వారు తమ పట్టణముల ప్రాంత భూములను అమ్ముకొనకూడదు; అవి వారికి శాశ్వత స్వాస్థ్యము.

అపోస్తలులకార్యములు 11:22 వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపువారు విని బర్నబాను అంతియొకయ వరకు పంపిరి.

గలతీయులకు 2:1 అటుపిమ్మట పదునాలుగు సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కూడ యెరూషలేమునకు తిరిగి వెళ్లితిని.