Logo

అపోస్తలులకార్యములు అధ్యాయము 9 వచనము 43

అపోస్తలులకార్యములు 9:35 వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోనులోను కాపురమున్న వారందరు అతని చూచి ప్రభువుతట్టు తిరిగిరి.

అపోస్తలులకార్యములు 11:21 ప్రభువు హస్తము వారికి తోడైయుండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభువుతట్టు తిరిగిరి.

అపోస్తలులకార్యములు 19:17 ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారికందరికి భయము కలిగెను గనుక ప్రభువైన యేసు నామము ఘనపరచబడెను.

అపోస్తలులకార్యములు 19:18 విశ్వసించినవారు అనేకులు వచ్చి, తాము చేసినవాటిని తెలియజేసి యొప్పుకొనిరి.

యోహాను 11:4 యేసు అది విని యీ వ్యాధి మరణముకొరకు వచ్చినది కాదుగాని దేవుని కుమారుడు దానివలన మహిమపరచబడునట్లు దేవుని మహిమకొరకు వచ్చినదనెను.

యోహాను 11:45 కాబట్టి మరియయొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి కాని

యోహాను 12:11 ప్రధానయాజకులు లాజరునుకూడ చంప నాలోచనచేసిరి.

యోహాను 12:44 అంతట యేసు బిగ్గరగా ఇట్లనెను నాయందు విశ్వాసముంచువాడు నాయందు కాదు నన్ను పంపినవానియందే విశ్వాసముంచుచున్నాడు.

అపోస్తలులకార్యములు 5:14 ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. పురుషులును స్త్రీలును అనేకులు మరియెక్కువగ విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి.

అపోస్తలులకార్యములు 10:23 మరునాడు అతడు లేచి, వారితో కూడ బయలుదేరెను; యొప్పేవారైన కొందరు సహోదరులును వారితో కూడ వెళ్లిరి.

అపోస్తలులకార్యములు 13:49 ప్రభువు వాక్యము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను

అపోస్తలులకార్యములు 28:14 అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు వారు తమయొద్ద ఏడు దినములుండవలెనని మమ్మును వేడుకొనిరి. ఆ మీదట రోమాకు వచ్చితివిు.