Logo

అపోస్తలులకార్యములు అధ్యాయము 17 వచనము 16

అపోస్తలులకార్యములు 18:1 అటుతరువాత పౌలు ఏథెన్సునుండి బయలుదేరి కొరింథునకు వచ్చి, పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్యయైన ప్రిస్కిల్లను కనుగొని వారియొద్దకు వెళ్లెను.

1దెస్సలోనీకయులకు 3:1 కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేమొంటిగానైనను ఉండుట మంచిదని యెంచి,

అపోస్తలులకార్యములు 18:5 సీలయు తిమోతియు మాసిదోనియనుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై, యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను.

2తిమోతి 4:10 దేమా యిహలోకమును స్నేహించి నన్ను విడిచి థెస్సలొనీకకు వెళ్లెను, క్రేస్కే గలతీయకును తీతు దల్మతియకును వెళ్లిరి;

2తిమోతి 4:11 లూకా మాత్రమే నాయొద్ద ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైనవాడు. తుకికును ఎఫెసునకు పంపితిని.

2తిమోతి 4:20 ఎరస్తు కొరింథులో నిలిచిపోయెను. త్రోఫిము రోగియైనందున అతని మిలేతులో విడిచి వచ్చితిని.

2తిమోతి 4:21 శీతకాలము రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నముచేయుము. యుబూలు, పుదే, లిను, క్లౌదియయు సహోదరులందరును నీకు వందనములు చెప్పుచున్నారు.

తీతుకు 3:12 నికొపొలిలో శీతకాలము గడపవలెనని నేను నిర్ణయించుకొన్నాను గనుక నేను అర్తెమానైనను తుకికునైనను నీయొద్దకు పంపినప్పుడు అక్కడికి నాయొద్దకు వచ్చుటకై ప్రయత్నము చేయుము.

అపోస్తలులకార్యములు 9:30 వారు అతనిని చంప ప్రయత్నము చేసిరి గాని సహోదరులు దీనిని తెలిసికొని అతనిని కైసరయకు తోడుకొనివచ్చి తార్సునకు పంపిరి.

రోమీయులకు 15:19 కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతమువరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించియున్నాను.

1కొరిందీయులకు 14:36 దేవుని వాక్యము మీయొద్దనుండియే బయలువెళ్లెనా? మీయొద్దకు మాత్రమే వచ్చెనా?

1కొరిందీయులకు 16:6 అప్పుడు మీయొద్ద కొంతకాలము ఆగవచ్చును, ఒకవేళ శీతకాలమంతయు గడుపుదును. అప్పుడు నేను వెళ్లెడి స్థలమునకు మీరు నన్ను సాగనంపవచ్చును.

1దెస్సలోనీకయులకు 1:1 తండ్రియైన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తు నందును ఉన్న థెస్సలొనీకయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. కృపయు సమాధానమును మీకు కలుగును గాక.

1దెస్సలోనీకయులకు 3:2 యీ శ్రమలవలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును, మీ విశ్వాసవిషయమై మిమ్మును హెచ్చరించుటకును, మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితివిు. మేము మీయొద్ద ఉన్నప్పుడు,