Logo

అపోస్తలులకార్యములు అధ్యాయము 23 వచనము 8

అపోస్తలులకార్యములు 14:4 ఆ పట్టణపు జనసమూహములో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపొస్తలుల పక్షముగాను ఉండిరి.

కీర్తనలు 55:9 పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టిపనులు చేయువారిని నిర్మూలము చేయుము వారి నాలుకలు ఛేదించుము.

మత్తయి 10:34 నేను భూమిమీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి; ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు.

యోహాను 7:40 జనసమూహములో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి;

యోహాను 7:41 మరికొందరుఈయన క్రీస్తే అనిరి; మరికొందరు ఏమి? క్రీస్తు గలిలయలోనుండి వచ్చునా?

యోహాను 7:42 క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బేత్లెహేమను గ్రామములోనుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి.

యోహాను 7:43 కాబట్టి ఆయననుగూర్చి జనసమూహములో భేదము పుట్టెను.

జెకర్యా 11:14 అప్పుడు బంధకమనునట్టి నా రెండవ కఱ్ఱను తీసికొని యూదా వారికిని ఇశ్రాయేలు వారికిని కలిగిన సహోదరబంధమును భంగము చేయునట్లు దాని విరిచితిని.

యోహాను 7:43 కాబట్టి ఆయననుగూర్చి జనసమూహములో భేదము పుట్టెను.

యోహాను 10:19 ఈ మాటలనుబట్టి యూదులలో మరల భేదము పుట్టెను.

అపోస్తలులకార్యములు 5:34 సమస్త ప్రజలవలన ఘనత నొందినవాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలను ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి ఈ మనుష్యులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను

అపోస్తలులకార్యములు 7:2 అందుకు స్తెఫను చెప్పినదేమనగా సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రాహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతమియలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై