Logo

అపోస్తలులకార్యములు అధ్యాయము 24 వచనము 12

అపోస్తలులకార్యములు 24:1 అయిదు దినములైన తరువాత ప్రధానయాజకుడైన అననీయయు, కొందరు పెద్దలును, తెర్తుల్లు అను ఒక న్యాయవాదియు కైసరయకు వచ్చి, పౌలుమీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసిరి.

అపోస్తలులకార్యములు 21:18 మరునాడు పెద్దలందరు అక్కడికి వచ్చియుండగా పౌలు మాతో కూడ యాకోబు నొద్దకు వచ్చెను.

అపోస్తలులకార్యములు 21:27 ఏడు దినములు కావచ్చినప్పుడు ఆసియనుండి వచ్చిన యూదులు దేవాలయములో అతని చూచి, సమూహమంతటిని కలవరపరచి అతనిని బలవంతముగా పట్టుకొని

అపోస్తలులకార్యములు 22:30 మరునాడు, యూదులు అతనిమీద మోపిన నేరమేమో తాను నిశ్చయముగా తెలిసికొనగోరి, సహస్రాధిపతి అతని వదిలించి, ప్రధానయాజకులును మహాసభ వారందరును కూడి రావలెనని ఆజ్ఞాపించి, పౌలును తీసికొనివచ్చి వారియెదుట నిలువబెట్టెను.

అపోస్తలులకార్యములు 23:11 ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి, తాము పౌలును చంపువరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టుపెట్టుకొనిరి.

అపోస్తలులకార్యములు 23:23 పౌలును ఎక్కించి అధిపతియైన ఫేలిక్సు నొద్దకు భద్రముగా తీసికొనిపోవుటకు గుఱ్ఱములను సిద్ధపరచుడని చెప్పెను.

అపోస్తలులకార్యములు 23:32 వారు కైసరయకు వచ్చి అధిపతికి ఆ పత్రిక అప్పగించి పౌలునుకూడ అతనియెదుట నిలువబెట్టిరి.

అపోస్తలులకార్యములు 23:33 అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు ఇతడు ఏ ప్రదేశపువాడని అడిగి, అతడు కిలికియవాడని తెలిసికొని

అపోస్తలులకార్యములు 24:17 కొన్ని సంవత్సరములైన తరువాత నేను నా స్వజనులకు దానద్రవ్యమును కానుకలును అప్పగించుటకు వచ్చితిని.

అపోస్తలులకార్యములు 21:26 అంతట పౌలు మరునాడు ఆ మనుష్యులను వెంట బెట్టుకొనిపోయి, వారితోకూడ శుద్ధిచేసికొని, దేవాలయములో ప్రవేశించి, వారిలో ప్రతివానికొరకు కానుక అర్పించువరకు శుద్ధిదినములు నెరవేర్చుదుమని తెలిపెను