Logo

ద్వితియోపదేశాకాండము అధ్యాయము 2 వచనము 8

సంఖ్యాకాండము 20:20 అంతట ఎదోము బహు జనముతోను మహా బలముతోను బయలుదేరి వారికెదురుగా వచ్చెను.

సంఖ్యాకాండము 20:21 ఎదోము ఇశ్రాయేలు తన పొలిమేరలలోబడి దాటిపోవుటకు సెలవియ్యలేదు గనుక ఇశ్రాయేలీయులు అతనియొద్దనుండి తొలగిపోయిరి.

న్యాయాధిపతులు 11:18 తరువాత వారు అరణ్యప్రయాణముచేయుచు ఎదోమీయులయొక్కయు మోయాబీయులయొక్కయు దేశముల చుట్టు తిరిగి, మోయాబునకు తూర్పు దిక్కున కనాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దరిని దిగిరి. వారు మోయాబు సరి హద్దు లోపలికి పోలేదు. అర్నోను మోయాబునకు సరి హద్దు గదా.

1రాజులు 9:26 మరియు రాజైన సొలొమోను ఎదోముదేశపు ఎఱ్ఱ సముద్రతీరమందున్న ఏలతు దగ్గర ఎసోన్గెబెరునందు ఓడలను కట్టించెను.

2రాజులు 14:22 ఇతడు రాజైన తన తండ్రి తన పితరులతో నిద్రించిన తరువాత ఏలతు అను పట్టణమును బాగుగా కట్టించి యూదావారికి దానిని మరల అప్పగించెను.

2రాజులు 16:6 ఆ కాలమందు సిరియారాజైన రెజీను ఏలతును మరల పట్టుకొని సిరియనుల వశముచేసి, ఏలతులోనుండి యూదావారిని వెళ్లగొట్టగా సిరియనులు ఏలతు పట్టణమునకు వచ్చి కాపురముండిరి. నేటివరకును వారచ్చటనే యున్నారు.

సంఖ్యాకాండము 33:35 ఎబ్రోనాలోనుండి బయలుదేరి ఎసోన్గెబెరులో దిగిరి.

ద్వితియోపదేశాకాండము 1:2 హోరేబునుండి శేయీరు మన్నెపు మార్గముగా కాదేషు బర్నేయవరకు పదకొండు దినముల ప్రయాణము.

2దినవృత్తాంతములు 8:17 సొలొమోను ఎదోము దేశముయొక్క సముద్రపు దరినున్న ఎసోన్గెబెరునకును ఏలతునకును పోగా