Logo

ద్వితియోపదేశాకాండము అధ్యాయము 10 వచనము 3

నిర్గమకాండము 25:5 ఎరుపురంగు వేసిన పొట్టేళ్లతోళ్లు, సముద్రవత్సల తోళ్లు, తుమ్మకఱ్ఱలు,

నిర్గమకాండము 25:10 వారు తుమ్మకఱ్ఱతో నొక మందసమును చేయవలెను. దాని పొడుగు రెండు మూరలునర, దాని వెడల్పు మూరెడునర, దాని యెత్తు మూరెడునర

నిర్గమకాండము 37:1 మరియు బెసలేలు తుమ్మకఱ్ఱతో ఆ మందసమును చేసెను. దాని పొడుగు రెండు మూరలనర దాని వెడల్పు మూరెడునర దాని యెత్తు మూరెడునర.

నిర్గమకాండము 37:2 లోపలను వెలుపలను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టు బంగారు జవను చేసెను.

నిర్గమకాండము 37:3 దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి, ఒక ప్రక్కను రెండు ఉంగరములును ఎదుటి ప్రక్కను రెండు ఉంగరములుండునట్లు దాని నాలుగు కాళ్లకు వాటిని తగిలించెను.

నిర్గమకాండము 37:4 మరియు అతడు తుమ్మకఱ్ఱతో మోతకఱ్ఱలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి

నిర్గమకాండము 37:5 మందసమును మోయుటకు దాని ప్రక్కలమీది ఉంగరములలో ఆ మోతకఱ్ఱలను చొనిపెను.

నిర్గమకాండము 37:6 మరియు అతడు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేసెను. దాని పొడుగు రెండు మూరలనర దాని వెడల్పు మూరెడునర;

నిర్గమకాండము 37:7 మరియు రెండు బంగారు కెరూబులను చేసెను, కరుణాపీఠము యొక్క రెండు కొనలను వాటిని నకిషిపనిగా చేసెను.

నిర్గమకాండము 37:8 ఒక్కొక్క కొనను ఒక్కొక్క కెరూబును కరుణాపీఠముతో ఏకాండముగా దాని రెండు కొనలమీద కెరూబులను చేసెను.

నిర్గమకాండము 37:9 ఆ కెరూబులు పైకివిప్పిన రెక్కలుగలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పెను. కెరూబుల ముఖములు ఒకదానికిఒకటి ఎదురుగా ఉండెను; వాటి ముఖములు కరుణాపీఠము వైపుగా నుండెను.

ద్వితియోపదేశాకాండము 10:1 ఆ కాలమందు యెహోవా మునుపటి వాటివంటి రెండు రాతిపలకలను నీవు చెక్కుకొని కొండయెక్కి నాయొద్దకు రమ్ము. మరియు నీవు ఒక కఱ్ఱమందసమును చేసికొనవలెను.

నిర్గమకాండము 34:4 కాబట్టి అతడు మొదటి పలకలవంటి రెండు రాతిపలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ రెండు రాతిపలకలను చేతపట్టుకొని సీనాయికొండ యెక్కగా

నిర్గమకాండము 36:20 మరియు అతడు మందిరమునకు తుమ్మకఱ్ఱతో నిలువు పలకలు చేసెను.

నిర్గమకాండము 38:6 ఆ మోతకఱ్ఱలను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి రాగి రేకులు పొదిగించెను.