Logo

ద్వితియోపదేశాకాండము అధ్యాయము 10 వచనము 6

సంఖ్యాకాండము 10:6 మీరు రెండవమారు ఆర్భాటముగా ఊదునప్పుడు దక్షిణదిక్కున దిగిన సైన్యములు సాగవలెను. వారు ప్రయాణమైపోవునప్పుడు ఆర్భాటముగా ఊదవలెను.

సంఖ్యాకాండము 10:12 తరువాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచెను.

సంఖ్యాకాండము 10:13 యెహోవా మోషేచేత పలికించిన మాటనుబట్టి వారు మొదట ప్రయాణము చేసిరి.

సంఖ్యాకాండము 33:1 మోషే అహరోనులవలన తమ తమ సేనలచొప్పున ఐగుప్తు దేశములోనుండి బయలుదేరివచ్చిన ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణములు ఇవి.

సంఖ్యాకాండము 33:2 మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము, వారి ప్రయాణములనుబట్టి వారి సంచారక్రమములను వ్రాసెను. వారి సంచారక్రమముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి.

సంఖ్యాకాండము 33:30 హష్మోనాలోనుండి బయలుదేరి మొసేరోతులో దిగిరి.

సంఖ్యాకాండము 33:31 మొసేరోతులోనుండి బయలుదేరి బెనేయాకానులో దిగిరి.

సంఖ్యాకాండము 33:32 బెనేయాకానులోనుండి బయలుదేరి హోర్‌హగ్గిద్గాదులో దిగిరి.

సంఖ్యాకాండము 33:33 హోర్‌హగ్గిద్గాదులోనుండి బయలుదేరి యొత్బాతాలో దిగిరి.

సంఖ్యాకాండము 20:23 యెహోవా ఎదోము పొలిమేరలయొద్దనున్న హోరుకొండలో మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను

సంఖ్యాకాండము 20:24 అహరోను తన పితరులతో చేర్చబడును; ఏలయనగా మెరీబా నీళ్లయొద్ద మీరు నా మాట వినక నామీద తిరుగుబాటు చేసితిరి గనుక నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు.

సంఖ్యాకాండము 20:25 నీవు అహరోనును అతని కుమారుడైన ఎలియాజరును తోడుకొని హోరుకొండ యెక్కి,

సంఖ్యాకాండము 20:26 అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించుము. అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును.

సంఖ్యాకాండము 20:27 యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేసెను. సర్వసమాజము చూచుచుండగా వారు హోరుకొండ నెక్కిరి.

సంఖ్యాకాండము 20:28 మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించెను. అహరోను కొండ శిఖరమున చనిపోయెను. తరువాత మోషేయు ఎలియాజరును ఆ కొండదిగి వచ్చిరి.

సంఖ్యాకాండము 33:38 యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండనెక్కి, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములోనుండి బయలుదేరి వచ్చిన నలువదియవ సంవత్సరమున అయిదవ నెల మొదటి దినమున అక్కడ మృతినొందెను.

నిర్గమకాండము 28:1 మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోనును, అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీయులలోనుండి నీయొద్దకు పిలిపింపుము.

లేవీయకాండము 6:22 అతని సంతతివారిలో అతనికి మారుగా అభిషేకము పొందిన యాజకుడు ఆలాగుననే అర్పింపవలెను. అది యెహోవా నియమించిన నిత్యమైన కట్టడ, అదంతయు దహింపవలెను.

సంఖ్యాకాండము 20:28 మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించెను. అహరోను కొండ శిఖరమున చనిపోయెను. తరువాత మోషేయు ఎలియాజరును ఆ కొండదిగి వచ్చిరి.

సంఖ్యాకాండము 27:13 నీవు దాని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడుదువు.

సంఖ్యాకాండము 33:31 మొసేరోతులోనుండి బయలుదేరి బెనేయాకానులో దిగిరి.