Logo

యెహోషువ అధ్యాయము 19 వచనము 24

లూకా 2:26 అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడకమునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మచేత బయలుపరచబడి యుండెను; ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను.

లూకా 2:27 అంతట ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తలిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసికొనివచ్చినప్పుడు

లూకా 2:28 అతడు తన చేతులలో ఆయనను ఎత్తికొని దేవుని స్తుతించుచు ఇట్లనెను

లూకా 2:29 నాథా, యిప్పుడు నీ మాటచొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు;

లూకా 2:30 అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను

లూకా 2:31 నీవు సకల ప్రజలయెదుట సిద్ధపరచిన

లూకా 2:32 నీ రక్షణ నేను కన్నులార చూచితిని.

లూకా 2:33 యోసేపును ఆయన తల్లియు ఆయననుగూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి.

లూకా 2:34 సుమెయోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడునట్లు, ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడియున్నాడు;

లూకా 2:35 మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసికొనిపోవునని ఆయన తల్లియైన మరియతో చెప్పెను.

లూకా 2:36 మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్త్రి యుండెను. ఆమె కన్యాత్వము మొదలు ఏడేండ్లు పెనిమిటితో సంసారముచేసి బహుకాలము గడిచినదై,

లూకా 2:37 యెనుబది నాలుగు సంవత్సరములు విధవరాలైయుండి, దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్లు సేవ చేయుచుండెను.

లూకా 2:38 ఆమె కూడ ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి, యెరూషలేములొ విమోచనకొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయననుగూర్చి మాటలాడుచుండెను.

ఆదికాండము 49:20 ఆషేరు నొద్ద శ్రేష్ఠమైన ఆహారము కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును.

సంఖ్యాకాండము 26:55 చీట్లువేసి ఆ భూమిని పంచిపెట్టవలెను. వారు తమ తమ పితరుల గోత్రముల జనసంఖ్యచొప్పున స్వాస్థ్యమును పొందవలెను.

సంఖ్యాకాండము 34:17 ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టవలసినవారెవరనగా, యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు.

న్యాయాధిపతులు 1:31 ఆషే రీయులు అక్కో నివాసులను సీదోను నివాసులను అహ్లాబు వారిని అక్జీబువారిని హెల్బావారిని అఫెకువారిని రెహోబు వారిని

న్యాయాధిపతులు 5:17 గిలాదు యొర్దాను అద్దరిని నిలిచెను దానీయులు ఓడలదగ్గర ఏల నిలిచిరి? ఆషేరీయులు సముద్రతీరమున తమ అఖాతములయొద్ద ఏల నిలిచిరి?

1రాజులు 4:16 ఆషేరులోను ఆలోతులోను హూషై కుమారుడైన బయనా యుండెను.

1దినవృత్తాంతములు 2:2 దాను యోసేపు బెన్యామీను నఫ్తాలి గాదు ఆషేరు.

యెహెజ్కేలు 48:2 దానుయొక్క సరిహద్దు నానుకొని తూర్పు పడమరలుగా ఆషేరీయులకు ఒక భాగము.