Logo

యెహోషువ అధ్యాయము 19 వచనము 32

ఆదికాండము 49:21 నఫ్తాలి విడువబడిన లేడి అతడు ఇంపైన మాటలు పలుకును.

సంఖ్యాకాండము 26:55 చీట్లువేసి ఆ భూమిని పంచిపెట్టవలెను. వారు తమ తమ పితరుల గోత్రముల జనసంఖ్యచొప్పున స్వాస్థ్యమును పొందవలెను.

ద్వితియోపదేశాకాండము 33:23 నఫ్తాలినిగూర్చి యిట్లనెను కటాక్షముచేత తృప్తిపొందిన నఫ్తాలి, యెహోవా దీవెనచేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనుము.

న్యాయాధిపతులు 1:33 బేత్షెమెషు నివాసులచేతను బేతనాతు నివాసులచేతను వెట్టి పనులు చేయించుకొనిరి.

న్యాయాధిపతులు 4:6 ఆమె నఫ్తాలి కెదెషులోనుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెనునీవువెళ్లి నఫ్తాలీయుల లోను జెబూలూనీయులలోను పదివేలమంది మనుష్యులను తాబోరు కొండయొద్దకు రప్పించుము;

1రాజులు 4:15 నఫ్తాలీము దేశమందు అహిమయస్సు ఉండెను; వీడు సొలొమోను కుమార్తెయైన బాశెమతును వివాహము చేసికొనెను.

యెహెజ్కేలు 48:3 ఆషేరీయుల సరిహద్దు నానుకొని తూర్పు పడమరలుగా నఫ్తాలీయులకు ఒక భాగము.

మత్తయి 4:13 నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్రతీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను.