Logo

యెహోషువ అధ్యాయము 19 వచనము 40

సంఖ్యాకాండము 26:55 చీట్లువేసి ఆ భూమిని పంచిపెట్టవలెను. వారు తమ తమ పితరుల గోత్రముల జనసంఖ్యచొప్పున స్వాస్థ్యమును పొందవలెను.

సంఖ్యాకాండము 34:17 ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టవలసినవారెవరనగా, యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు.

యెహోషువ 10:40 అప్పుడు యెహోషువ మన్యప్రదేశమును దక్షిణ ప్రదే శమును షెఫేలాప్రదేశమును చరియలప్రదేశమును వాటి రాజులనందరిని జయించెను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు అతడు శేషమేమియు లేకుండ ఊపిరిగల సమస్తమును నిర్మూలము చేసెను.

న్యాయాధిపతులు 18:1 ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. మరియు ఇశ్రాయేలీయుల గోత్రములలో ఆ దినమువరకు దానీయులు స్వాస్థ్యము పొంది యుండలేదు గనుక ఆ కాలమున తాము నివసించుటకు తమకు స్వాస్థ్యము వెదకు కొనుటకై వారు బయలుదేరియుండిరి.

న్యాయాధిపతులు 18:30 దానీయులు చెక్కబడిన ఆ ప్రతి మను నిలుపుకొనిరి. మోషే మనుమడును గెర్షోను కుమారుడునైన యోనాతాననువాడును వాని కుమారులును ఆ దేశము చెరపట్టబడువరకు దానీయుల గోత్రమునకు యాజ కులై యుండిరి.

యెహెజ్కేలు 48:1 గోత్రముల పేరులు ఇవి; దానీయుల కొకభాగము .. అది ఉత్తరదిక్కు సరిహద్దునుండి హమాతునకుపోవు మార్గమువరకు హెత్లోనునకుపోవు సరిహద్దువరకును హసరేనాను అను దమస్కు సరిహద్దువరకును హమాతు సరిహద్దు మార్గమున తూర్పుగాను పడమరగాను వ్యాపించు భూమి.